AP High Court : గ్రూప్‌-1 ఇంటర్వ్యూలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

గ్రూప్-1 పేపర్ల వాల్యుయేషన్‌లో అవకతవకలు జరిగాయని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టులో తుది విచారణ జరిగింది.

AP High Court : గ్రూప్‌-1 ఇంటర్వ్యూలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Ap High Court (1)

AP High Court : ఏపీలో గ్రూప్‌-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్. గ్రూప్‌-1 ఇంటర్వ్యూలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తుది తీర్పునకు లోబడి నియామకాలు జరుపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎట్టకేలకు గ్రూప్‌-1 ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్స్ సర్వీసుల్లో రీ వాల్యుయేషన్ లేదని, వాల్యుయేషన్‌లో ఎలాంటి తప్పులు జరగలేదని ఏపీపీఎస్సీ న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు.

గ్రూప్-1 పేపర్ల వాల్యుయేషన్‌లో అవకతవకలు జరిగాయని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టులో తుది విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించుకోవచ్చని, కోర్టు తుది తీర్పునకు లోబడి నియామకాలు జరపాలని సూచించింది. పిటిషనర్ల సమాధాన పత్రాలు, మార్కుల జాబితాను సీల్డ్ కవర్‌లో కోర్టు ముందు ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Ts Government: 1,326 వైద్యుల పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

గతంలో గ్రూప్-1 మెయిన్ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. మెయిన్ పరీక్ష సమాధాన పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, ప్రశ్నపత్రాలను థర్డ్ పార్టీ తయారు చేసిందని.. మళ్లీ పరీక్ష నిర్వహించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులను గతంలో విచారించిన కోర్టు తదుపరి విచారణలను నిలిపివేస్తూ తీర్పును రిజర్వ్ చేసింది.