AP High Court On Bigg Boss : బిగ్‌బాస్ షో బ్యాన్..? అశ్లీలతపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. బిగ్ బాస్ షోలో అశ్లీలతపై ఏపీ హైర్టు ఘాటుగా స్పందించింది. 1970లో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా అని వ్యాఖ్యానించింది.

AP High Court On Bigg Boss : బిగ్‌బాస్ షో బ్యాన్..? అశ్లీలతపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

AP High Court On Bigg Boss : బిగ్ బాస్ షోలో అశ్లీలతపై ఏపీ హైర్టు ఘాటుగా స్పందించింది. 1970లలో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా అని వ్యాఖ్యానించింది.

బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఐబీఎఫ్ గైడ్స్ లైన్స్ ను షో నిర్వాహకులు పాటించడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అశ్లీలత ఎక్కువగా ఉందని కోర్టుకు తెలియజేశారు. వెంటనే షోను ఆపేయాల్సిందిగా ఆదేశించాలని అభ్యర్థించారు. అశ్లీలత ఎక్కువగా ఉండటంతో కుటుంబ సభ్యులతో కలిసి చూడలేకపోతున్నామని చెప్పారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి 1970ల్లో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా అని వ్యాఖ్యానించారు. ప్రతివాదులకు నోటీసులపై.. వచ్చే విచారణలో నిర్ణయిస్తామన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను అక్టోబర్ 11కు వాయిదా వేసింది.

కాగా.. బిగ్ బాస్ రియాల్టీ షో వివాదానికి కేరాఫ్ గా మారింది. ఈ రియాల్టీ షో పై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో అసభ్యంగా ఉంటోందని మండిపడుతున్నారు. బిగ్ బాస్ బూతుల స్వర్గమని విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అది రియాల్టీ షో కాదు బూతు షో అని అంటున్నారు. బిగ్ బాస్ షో ద్వారా సభ్య సమాజానికి ఏం మేసేజ్ ఇద్దామని అనుకుంటున్నారు? అని నిలదీస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ క్రమంలో ఈ షోను బ్యాన్ చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోర్టులో విచారణ సందర్భంగా… ఈ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది శివప్రసాద్ రెడ్డి తన వాదనలను వినిపించారు. ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ గైడ్ లైన్స్ ను టీవీ షోలు పాటించడం లేదని చెప్పారు.

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ లో అశ్లీలతపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. 1970ల్లో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా? అని ప్రశ్నించింది. అయితే, దీనిపై స్పందించేందుకు కేంద్రం తరపు న్యాయవాది సమయం కోరారు. ప్రతివాదులకు నోటీసు ఇచ్చే విషయాన్ని తదుపరి వాయిదాలో నిర్ణయిస్తామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను అక్టోబర్ 11కు వాయిదా వేసింది.

కాగా బిస్‌బాస్‌ను బ్యాన్‌ చేయాలంటూ ఇప్పటికే పలువురు డిమాండ్‌ చేస్తుండటం తెలిసిందే. ఎమ్మెల్యే రాజాసింగ్‌, సీపీఐ నారాయణ సైతం బిగ్‌బాస్‌పై ఫైర్ అయ్యారు. బిగ్ బాస్ రియాల్టీ షో కాదని దరిద్రపు బూతు షో అని విమర్శిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ షో చూడలేని పరిస్థితి ఉందన్నారు. ఈ షో తో సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు.

Narayana fires on BiggBoss : బిగ్‌బాస్ ని వ్యభిచారంతో పోల్చిన నారాయణ.. వాళ్ళకి కూడా గుండు కొట్టించండి అంటూ ఫైర్

బిగ్ బాస్.. దేశంలోని పాపులర్ రియాల్టీ షోలలో ఒకటి. హిందీతో పాటు కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు భాషల్లోనూ సక్సెస్ అయింది. ప్రస్తుతం తెలుగులో బిగ్ బాగ్ షో 6వ సీజన్ నడుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ షోలతో సెలబ్రిటీలుగా మారిపోతున్నారు కంటెస్టెంట్స్. సినిమాల్లోనూ మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. అయితే బిగ్ బాస్ షో ఎంత పాపులర్ అయిందో అంతే కాంట్రవర్సీకి దారితీసింది. ఈ షోపై విమర్శలు అదే రేంజ్ లో ఉంటాయి. బిగ్ బాగ్ హౌజ్ లో అశ్లీలత పెరిగిపోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రోత పుట్టిస్తున్నారని, బూతులు మాట్లాడుకుంటూ చిల్లరగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.

బిగ్ బాస్ షోపై సీపీఐ నారాయణ మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్నారు. బిగ్ బాస్ హౌజ్ ను ఆయన ఏకంగా బ్రోతల్ హౌస్ తో పోల్చారు. వింత జంతువులు హౌస్ లోకి వచ్చారంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వంద రోజులు స్వచ్చందంగా షో లో పాల్గొన్నామని చెబితే ఎవరు నమ్ముతారని నారాయణ అన్నారు.

CPI Narayana On Bigg Boss Show : రియాల్టీ షో కాదు బూతు షో.. బిగ్‌బాస్‌పై నారాయణ ఫైర్, బ్యాన్ చేయాలని డిమాండ్

”నా దృష్టిలో బిగ్ బాస్ అనేది సమాజానికి శత్రువే. దాంతో సమాజానికి ఎలాంటి ఉపయోగమూ లేదు. ముక్కూ మొహం తెలియని వాళ్లంతా వస్తారు. దాదాపు 100 రోజుల పాటు పెద్ద భవంతిలో పారేస్తారు. ఇందులో కల్చర్ నేర్చుకోండి అని చెప్పడం దారుణం. కోట్లాది మంది యువత శక్తిని ఈ షో నిర్వీర్యం చేస్తోంది. చెడు సంకేతాలు పంపిస్తున్నారు. సామాజిక రుగ్మత ఇది. దరిద్రపు షో తప్ప రియాల్టీ షో కానే కాదు. రియాల్టీ బూతు షో” అని నిప్పులు చెరిగారు నారాయణ.