AP High Court warning to Govt : ‘ పేద విద్యార్ధులు స్కూల్లో ఉండాలి..లేదా మీరు జైల్లో ఉండాలి’ అంటూ ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు వార్నింగ్

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. పేద పిల్లలకు విద్య అందించే విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది అంటూ సీరియస్ అయ్యింది. ఈసారి మొట్టికాయలతో పాటు వార్నింగ్ కూడా ఇచ్చింది. ‘‘ పేద విద్యార్ధులు స్కూల్లో ఉండాలి. లేదా మీరు జైల్లో ఉండాలి’’ అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

AP High Court warning to Govt : ‘ పేద విద్యార్ధులు స్కూల్లో ఉండాలి..లేదా మీరు జైల్లో ఉండాలి’ అంటూ ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు వార్నింగ్

AP High Court warning to Govt

AP High Court warning to Govt :  ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. పేద పిల్లలకు విద్య అందించే విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది అంటూ సీరియస్ అయ్యింది. ఈసారి మొట్టికాయలతో పాటు వార్నింగ్ కూడా ఇచ్చింది. ‘‘ పేద విద్యార్ధులు స్కూల్లో ఉండాలి. లేదా మీరు జైల్లో ఉండాలి’’ అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. పేదలకు విద్య దూరం అవుతోంది..అంటూ ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది. అమల్లో భాగంగా పేదలకు ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు కేటాయించే వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు ప్రభుత్వంపై మండిపడింది. ప్రైవేటు స్కూళ్లలో పేదలకు 25 శాతం సీట్లు కేటాయించాలని విద్యాహక్కు చట్టం చెప్తున్నా ప్రభుత్వం మాత్రం విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వంలో కీలకమైన సీఎస్ తో పాటు విద్యాశాఖ అధికారులకు వార్నింగ్ ఇచ్చింది.

పేదలకు ప్రైవేటులో 25 శాతం సీట్లు ఏపీలో విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా పేద విద్యార్ధులకు 25 శాతం సీట్లు కేటాయించాలన్న నిబంధనను అమలు చేయకపోవడంపై దాఖలైన పిటిషన్లను గతంలోనే విచారించిన హైకోర్టు.. దీన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టంచేసింది. కోర్టు చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ తరపు న్యాయవాది మాట్లాడుతూ పేద పిల్లలకు సీట్ల భర్తీ చేశామని దానికి సంబంధించిన వివరాలు కోర్టుకు సమర్పించేందుకు సమయం కావాలి అని కోరారు. దీంతో కోర్టు సెప్టెంబర్ 7కి కేసు విచారణు వాయిదా వేసింది. దీనికి ధర్మాసంన వివరాలు సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగత హాజరుకు ఆదేశిస్తామని వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం పేద పిల్లలకు విద్య అందించేందుకు చర్యలు తీసుకోకుండా పరోక్షంగా ప్రైవేటు పాఠశాలను ప్రోత్సహిస్తోందని..ఈ తీరు మార్చుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీట్లు ఇచ్చామని ప్రభుత్వం కేవలం మాటల ద్వారా మాత్రమే చెబితే సరిపోదని..దానికి సంబంధించిన పూర్తి వివరాలు న్యాయస్థానానికి సమర్పించాలని ఆదేశించింది. ఎంతమందికి సీట్లు ఇచ్చారో పూర్తి వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. సీట్లు ఇస్తారా? లేదా మీరు జైలుకు వెళతారా? అంటూ విద్యాశాఖ అధికారులకు వార్నింగ్ ఇచ్చింది.

పేదలకు ప్రైవేటులో 25 శాతం సీట్లు ఏపీలో విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా పేద విద్యార్ధులకు 25 శాతం సీట్లు కేటాయించాలన్న నిబంధనను అమలు చేయకపోవడంపై దాఖలైన పిటిషన్లను గతంలోనే విచారించిన హైకోర్టు.. దీన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని తీర్పు ఇచ్చింది. కానీ ప్రభుత్వం మాత్రం ఆదేశాలు ఇచ్చినా అమల్లో మాత్రం నిర్లక్ష్యంగా ఉంటోంది. దీంతో పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కోర్టు ధిక్కార వాజ్యం దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టింది.

జగన్ సర్కార్ పై హైకోర్టు సీరియస్ ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్ధులకు విద్యాహక్కు చట్టం కింద 25 శాతం సీట్లు తప్పనిసరిగా కేటాయించాలని గతంలో తాము ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం దాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం పట్ల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం మొదటి తరగతిలో 25 శాతం సీట్ల భర్తీ సరిగ్గా లేదని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.