రాజధానిపై సస్పెన్స్ : రేపు మరోసారి సీఎంతో హైపవర్ కమిటీ భేటీ

రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన సీఎం జగన్, హైపవర్ కమిటీ భేటీ ముగిసింది. శుక్రవారం(జనవరి 17,2020) సీఎం జగన్ తో హైపవర్ కమిటీ సమావేశం అయ్యింది. రాజధాని

  • Published By: veegamteam ,Published On : January 17, 2020 / 09:17 AM IST
రాజధానిపై సస్పెన్స్ : రేపు మరోసారి సీఎంతో హైపవర్ కమిటీ భేటీ

రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన సీఎం జగన్, హైపవర్ కమిటీ భేటీ ముగిసింది. శుక్రవారం(జనవరి 17,2020) సీఎం జగన్ తో హైపవర్ కమిటీ సమావేశం అయ్యింది. రాజధాని

రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన సీఎం జగన్, హైపవర్ కమిటీ భేటీ ముగిసింది. శుక్రవారం(జనవరి 17,2020) సీఎం జగన్ తో హైపవర్ కమిటీ సమావేశం అయ్యింది. రాజధాని అంశంపై చర్చించింది. జీఎన్ రావ్, బోస్టన్ గ్రూప్ కమిటీలు ఇచ్చిన నివేదికలపై సీఎం జగన్ తో హైపవర్ కమిటీ సభ్యులు చర్చించారు. కమిటీ సభ్యులు సీఎం జగన్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాగా, ఈ భేటీ అప్పుడే అయిపోలేదు. ఇంకా మిగిలే ఉంది. రేపు(జనవరి 18,2020) మరోసారి సీఎం జగన్ తో హైపవర్ కమిటీ భేటీ కానుంది. 3 రాజధానులపై ఇవాళ ఫుల్ క్లారిటీ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఎటూ తేల్చకుండా సస్పెన్స్ కంటిన్యూ చేసింది ప్రభుత్వం.

రాజధానిపై హైపవర్ కమిటీ సభ్యులు తుది నివేదిక రూపకల్పన చేసే పనిలో ఉన్నారు. రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తామని హైపవర్ కమిటీ తెలిపింది. మూడు సార్లు సమావేశమై వివిధ అంశాలపై చర్చించినట్టు తెలిపారు. రాజధాని రైతులకు మరింత మేలు చేసేలా సీఎం జగన్ సూచనలు చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

తాడేపల్లిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. కీలక అంశాలపై చర్చించారు. గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. CRDA రద్దుకు యోచన చేస్తున్నారని తెలుస్తోంది. కమిటీ తుది నివేదికను ఈ నెల 20న ప్రభుత్వానికి సమర్పించే ఛాన్స్ ఉంది. అదే రోజు జరిగే అసెంబ్లీ సమావేశంలో ఏపీలో పరిపాలనా వికేంద్రీకరణ, రాజధానుల అంశంపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశముంది. ఈ సమావేశాల్లోనే బిల్లును పాస్ చేయించాలనే యోచనలో ఉంది వైసీపీ ప్రభుత్వం.

రైతుల్లో ఎక్కువ మంది భూములు వెనక్కి తీసుకొనేందుకు నిరాకరిస్తున్నందున.. అమరావతి ప్రాంతాన్ని ఇండస్ట్రియల్, ఎడ్యుకేషనల్, మెడికల్ జోన్‌గా అభివృద్ధి చేయాలని.. తద్వారా అమరావతి వాసులకు ఉద్యోగం, ఉపాధి కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని రైతులు తమ అభిప్రాయాలు చెప్పుకోవాలని ప్రభుత్వం విధించిన గడువు శుక్రవారంతో ముగుస్తుంది. రాజధాని రైతులతో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి బొత్స ప్రకటించారు. రైతులకు మేలు జరిగేలా కార్యక్రమాలను చేయాలని సీఎం జగన్ సూచించడం జరిగిందన్నారు. రాజధాని రైతుల అభిప్రాయాలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన ఈమెయిల్ లో.. టెక్నికల్ సమస్యలు ఏర్పడలేదని వెల్లడించారు. చంద్రబాబు మాయలో పడొద్దని రైతులకు సూచించారు మంత్రి బొత్స.

CRDA రద్దు గురించి తనకు తెలియదని మంత్రి బొత్స అన్నారు. అమరావతి అంశంపై నియమించబడిన కమిటీల నివేదికలను హైపవర్ కమిటీ పరిశీలించిందన్నారు. ప్రాంతాల్లో ఉన్న అసమానతలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగిందన్నారు. ప్రజాభీష్టం మేరకు ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తామని, మూడు రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు. అమరావతిలో ఉన్న నిర్మాణాలను ఉపయోగించుకుంటామని, అన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. రాజధాని విషయంలో జనసేన, బీజేపీ పార్టీలకు ఇప్పుడు జ్ఞానోదయం అయ్యిందా అని బొత్స ప్రశ్నించారు. ఉనికిని కాపాడుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నవి పట్టించుకోమన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు తాము కృషి చేస్తామన్నారు.

బొత్స కామెంట్స్:
* అమరావతి రైతులకు మరింత లబ్ది కలిగేలా సీఎం జగన్ సూచనలు చేశారు
* రైతుల సలహాలు, సూచనలు సీఆర్ఢీయేకు ఇవ్వాలని చెప్పాం
* సీఆర్డీఏ రద్దు గురించి నాకు తెలియదు
* తాత్కాలిక అసెంబ్లీ అని గతంలో చంద్రబాబు అనలేదా
* నేడు శాశ్వత భవనమని మాట మార్చారు
* అమరావతిలో నిర్మిస్తున్న భవనాలను కచ్చితంగా పూర్తి చేస్తాం
* అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ అని సూచన వచ్చింది
* సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం

* 13 జిల్లాల అభివృద్ది బాధ్యత ప్రభుత్వానిదే
* రైతుల పట్ల మాకు సానుభూతి ఉంది
* చంద్రబాబు మాయంలో రైతులు పడొద్దు
* హై పవర్ కమిటీ సమావేశాల వివరాలు సీఎంకు వివరించాం
* ప్రజల మనోభావాలకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తాం
* మూడు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం
* మూడు రాజధానుల అమలు దిశగా అడుగులు
* హైపవర్ కమిటీ నివేదికను కేబినెట్ ముందు ఉంచుతాం

* రాజధాని రైతులతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది
* కొందరు రాజధాని గ్రామాల రైతులు న్యాయం చేయాలని కోరారు
* భూములు ఇచ్చిన రైతులను ఆదుకుంటాం
* 13 జిల్లాల అభివృద్ధితో పాటు అమరావతి అభివృద్ధి జరుగుతుంది
* అమరావతి రైతులు ఆందోళన చెందొద్దు

Also Read : Google Pay వాడుతున్నారా? : మీ బ్యాంక్ అకౌంట్లు ఈజీగా చెక్ చేసుకోవచ్చు