చేతకాకపోతే తప్పుకోండి, డీజీపీ గౌతమ్ సవాంగ్ పై ఏపీ హైకోర్టు సీరియస్

  • Published By: naveen ,Published On : September 14, 2020 / 04:03 PM IST
చేతకాకపోతే తప్పుకోండి, డీజీపీ గౌతమ్ సవాంగ్ పై ఏపీ హైకోర్టు సీరియస్

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై హైకోర్టు సీరియస్ అయ్యింది. చేతకాకపోతే తప్పుకోండి అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఓ కేసు విషయంలో కోర్టు ఈ కామెంట్స్ చేసింది. అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యం అయ్యాడు. బాధితుడి మేనమామ హైకోర్టుని ఆశ్రయించాడు. కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. డీజీపీ గౌతమ్ సవాంగ్ పై మండిపడింది.
https://10tv.in/high-court-oders-on-amarawati/
గతంలో మూడుసార్లు జ్యుడీషియల్ విచారణ చేస్తే పోలీసులదే తప్పని తేలిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో డీజీపీని పలుసార్లు కోర్టుకి పిలిపించినా మార్పు రాలేదంది.

ప్రతిసారి ఇలాంటి పరిస్థితి వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని కోర్టు అంది. పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ పదవికి రాజీనామా చేయాలంది. ప్రతి కేసులో సీబీఐ విచారణ సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.