ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి!

  • Published By: srihari ,Published On : June 12, 2020 / 10:56 AM IST
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి!

ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేశ్ తన చేతుల మీదుగా విడుదల చేశారు. ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తున్నట్టు మంత్రి ఆదిమూలపు చెప్పారు. కాలేజీలు ర్యాంకులపై ప్రచారం చేయకూడదని తెలిపారు.

జూన్ 15 నుంచి విద్యార్థులకు మార్కులు మెమోలు జారీ చేయనున్నట్టు చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలో ఫలితాలు విడుదల చేయడం చరిత్రాత్మకంగా ఆయన పేర్కొన్నారు. మార్చి 19నే వాల్యుయేషన్ ప్రక్రియ మొదలైందని అన్నారు. ఇంటర్ ఫలితాలను చూసుకునేందుకు విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని మంత్రి సురేశ్ సూచించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఏపీ ఇంటర్ పరీక్షలకు 10,65,155 మంది విద్యార్థులు హాజరయ్యారు. 

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాసిన వారిలో 5,07,228 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలు 4,88,795 మంది విద్యార్థులు హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో ఈసారి ఫలితాలను ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నట్టు మంత్రి ఆదిమూలపు చెప్పారు. అన్ని సవాళ్లను ఎదుర్కొని ఇంటర్ ఫలితాలను విడుదల చేసినట్టు ఆయన తెలిపారు. 

ఇంటర్ పరీక్షా ఫలితాలను ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://bie.ap.gov.in వెబ్‌సైట్‌లో విద్యార్థులు చూసుకోవచ్చు. గ్రేడింగ్ విధానం రద్దు అయినందున ఫస్ట్ ఇయర్ విద్యార్థుల ఫలితాలను సబ్జెక్టుల వారీగా మార్కుల రూపంలో ప్రకటిస్తారు. సెకండ్ ఇయర్ విద్యార్థులకు మాత్రం గ్రేడ్లను ప్రకటిస్తారు.