ఏపీలో జెండర్ బడ్జెట్ : పథకాలకు ఎంతెంత ఖర్చు చేసేది ముందే చెబుతాం – జగన్

ఈ సంవత్సరం బడ్జెట్ లో జెండర్ బడ్జెట్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నట్లు, రాష్ట్రంలో అక్కా చెలెళ్లమ్మలకు తోడుగా..అండగా ప్రభుత్వం ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు.

ఏపీలో జెండర్ బడ్జెట్ : పథకాలకు ఎంతెంత ఖర్చు చేసేది ముందే చెబుతాం – జగన్

Jagan

Gender Budget : అంతర్జాతీయ దినోత్సవం రోజున సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలిసారిగా..ఈ సంవత్సరం బడ్జెట్ లో జెండర్ బడ్జెట్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారాయన. రాష్ట్రంలో అక్కా చెళ్లెమ్మలకు తోడుగా..అండగా ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ఎంత కేటాయింపులు, ఎంత ఖర్చు చేయబోతున్నాం..ఎంత ఖర్చు చేస్తామో..డేటాను..నేరుగా బడ్జెట్ లో పొందుపరుస్తామన్నారు.

2021, మార్చి 08వ తేదీ సోమవారం మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామని, అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, కాపు నేస్తం మహిళల పేరిట ఇళ్ల స్థలం, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు వంటి పథకాలు తెచ్చామనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఇప్పటికీ 40 శాతం మంది మహిళలకు చదువు అందడం లేదన్న ఆయన.. చదువులకు పేదరికం అడ్డుకాకూడదనే అమ్మఒడి పథకం తీసుకొచ్చామన్నారు. రెండేళ్లలో రూ.13,220 కోట్లు అమ్మఒడి పథకం కింద ఇచ్చినట్లు, ఐదేళ్లలో రూ.32,500 కోట్లను అమ్మఒడి కింద ఇస్తామన్నారు. ఇక వైఎస్సార్‌ చేయూత కింద రూ.4,604 కోట్లు, ఇళ్ల స్థలాల ద్వారా మహిళలకు రూ.27వేల కోట్లు, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్‌ చేయూత ద్వారానే 21 నెలల్లో రూ. 80వేల కోట్లు ఇచ్చామన్నారు. మహిళలపై వేధింపుల నిరోధానికి ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తామని, 10 మందికి మించి మహిళలు ఉన్న కార్యాలయాల్లో కమిటీలు నియమిస్తామని వెల్లడించారు.