వంగపండు కుమార్తెకు సీఎం జగన్ ఫోన్.. అండగా ఉంటానని హామీ..కళాకారుల హర్షం

  • Published By: madhu ,Published On : August 6, 2020 / 02:13 PM IST
వంగపండు కుమార్తెకు సీఎం జగన్ ఫోన్.. అండగా ఉంటానని హామీ..కళాకారుల హర్షం

ఏం పిల్లడో ఎల్దమొస్తవా అంటూ.. ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేసిన‌.. ఉత్తరాంధ్ర జానపద శిఖరం వంగపండు కుటుంబానికి అండగా ఉంటామని ఏపీ సీఎం జగన్ వెల్లడించడం పట్ల…కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లు కళా సేవలో ఉంటూ..అన్నీ పొగొట్టుకున్న వారికి ఒక ఊరట అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.



వంగపండు విషయంలో సీఎం జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కళా సంఘాలు స్వాగతిస్తున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన ప్రజాకవి వంగపండు..ఇటీవలే తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 80 ఏళ్ల వయస్సు, 60 ఏళ్ల సాహిత్యం ఉన్న ఆయన్ను ఎవరూ పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి.

కానీ..ఆయన మరణించడం పట్ల..ఏపీ ప్రభుత్వం దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. అంతేకాదు…ఆ ప్రజాకవికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించింది. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి ప్రజా కళా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఎన్నో ఏళ్లుగా..ప్రజా కవిగా ఉన్న కూడా..ఆయనకు దక్కని గౌరవం..మరణానంతరం దక్కిందంటున్నారు.



వంగపండు కుమార్తెకు ఫోన్ చేసి పలకరించి ఓదార్చారు సీఎం జగన్. కుటుంబానికి అండగా ఉంటానని హామీనిచ్చారు. అంతేగాకుండ..ఉత్తరాంధ్రలో వంగపండు విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ విధంగా ఇది మరుగున పడిన కళాకారులకు పెద్ద ఎత్తున స్వాంతనగా వెల్లడిస్తున్నారు.