Junior Doctors Strike : ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె బాట

ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన జూనియర్ డాక్టర్లు, తమకు ఇన్ సెంటివ్స్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా తమకు కూడా ఇన్ సెంటివ్స్ ఇవ్వాలని నోటీసులో ప్రస్తావించారు.

Junior Doctors Strike : ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె బాట

Junior Doctors Strike

Junior Doctors Strike : ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన జూనియర్ డాక్టర్లు, తమకు ఇన్ సెంటివ్స్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా తమకు కూడా ఇన్ సెంటివ్స్ ఇవ్వాలని నోటీసులో ప్రస్తావించారు.

ఇవ్వకపోతే విధులు బహిష్కరిస్తామని జూడాలు ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టం చేశారు. అటు సీనియర్ రెసిడెంట్స్ ఇప్పటికే విధులు బహిష్కరించి సమ్మె బాట పడుతున్నారు. పీజీ విద్యార్థులు సైతం విధులు బహిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు.

”స్టైపండ్ హైక్ కోసం రెండేళ్లుగా పోరాటం చేస్తున్నాం. 2020 జనవరిలో హైక్ చేయాల్సి ఉంది. అప్పటి నుంచి పెంచలేదు. లాస్ట్ ఈయర్ ప్యాండమిక్ అని చెప్పలేదు. 2020 నవంబర్ నుంచి మేము అడుగుతున్నాం. ఇవాళ, రేపు అంటూ వాయిదాలు వేస్తున్నారు. మరో మూడు నెలల్లో మా డ్యూరేషన్ అయిపోతుంది. తెలంగాణలో 80వేల 500 ఇస్తున్నారు. మన దగ్గర టీడీఎస్ పోను 40వేలు వస్తుంది. అంటే సగానికి సగమే ఇస్తున్నారు. మన జూనియర్ పోస్టు గ్రాడ్యుయేట్స్ కూడా మా కంటే ఎక్కువగా 48వేలు వస్తున్నాయి. మాకేమో 40వేలే ఇస్తున్నారు. ఇది పెంచాలన్నది మా ప్రధాన డిమాండ్.

ఏ రాష్ట్రంలోనూ ట్యాక్స్ కట్ చెయ్యడం లేదు. కానీ ఏపీలో మాత్రం ట్యాక్స్ కూడా కట్ చేస్తున్నారు. ఎలా అయితే ఒడిశా, కేరళ, కర్నాటక, తమిళనాడులో ఇన్ సెంటివ్స్ ఇస్తున్నారో అదే విధంగా ఇవ్వాలి. సర్జరీలు చెయ్యకుండా కొవిడ్ వార్డుల్లో పని చేస్తున్నాం. దీనికంటూ ఏదో ఒక ఇన్ సెంటివ్ ఇవ్వాలి. సీఎం జగన్ మాకు అపాయింట్ మెంట్ ఇచ్చి మా సమస్యలు విని మాకు ఏదో ఒక భరోసా ఇస్తే సమ్మె విరమించుకోవడానికి మేము రెడీగా ఉన్నాం” రామకృష్ణ-సీనియర్ రెసిడెంట్ డాక్టర్.