అక్షరం విలువ తెలిసింది : సంతకం నేర్చుకోవటానికి స్కూలుకు వెళ్తున్న మహిళ

అక్షరం విలువ తెలిసింది : సంతకం నేర్చుకోవటానికి స్కూలుకు వెళ్తున్న మహిళ

Women Daily Go To School And Learns Her Signature

women daily go to school and learns her signature : సంతకం. అక్ష్యరాస్యతకు గుర్తు. అటువంటి సంతకం ఎంత విలువైందో తెలుసుకుందో మహిళ. తన పేరును తానే స్వయంగా రాసుకోవాలి. సంతకం పెట్టటం నేర్చుకోవాలని తపన పడింది.అందుకే ప్రతీరోజు స్కూలుకు వెళుతోంది. చిన్నప్పుడు పలకపై బలపం పట్టుకుని స్కూలుకు వెళ్లే అవకాశం లేక కనీసం తన సంతకాన్ని తాను రాసుకోలేని పరిస్థితిని మార్చుకోవాలనుకుంది ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన సుజాత అనే ఓ మహిళ. అందుకే ఈ వయస్సులో ప్రతీరోజు స్కూలుకు వెళ్లి సంతకం నేర్చకుంటోంది. సంతకం నేర్చుకోవాలనే ఆమె తపనను అర్థం చేసుకున్న టీచర్లు ఆమె పేరును ఓ పలక మీద రాసి దిద్దమని ఇచ్చారు.అలా ప్రతీరోజు విద్యార్ధిలాగా స్కూలుకు వెళ్లి సంతకం దిద్దుతోంది సుజాత.

నందికొట్కూరు జంగాలపేట స్కూల్ సమీపంలో నివాసం ఉంటోంది సుజాత. ఆమె చదువుకోలేదు. కానీ పెళ్లి అయి పిల్లలు పుట్టాక సంతకం విలువేంటో తెలిసింది. పొదుపు సంఘంలో చేరాలంటే సంతకం పెట్టటం తప్పనిసరి అని తెలుసుకుని సంతకం విలువ ఏంటో తెలుసుకుంది. దీంతో ఎలాగైన సంతకం నేర్చుకోవాలని భావించింది. తన పేరు రాయడం సంతకం చేయడం నేర్చుకొనేందుకు ఆమె రోజూ స్కూల్‌కు వెళుతున్నారు. తన పేరుతో సంతకం చేయాలన్న పలకా, బలపంతో పాఠశాలకు వచ్చి నేర్చుకుంటోంది సుజాత.

స్కూల్లో పనిచేసే టీచర్ తో పలకపై పేరు రాయించుకుని దిద్దుతోంది. తన పేరును తానే పలుకుతూ దిద్దుకుంటోంది. అలా పాడగా పాడగా పాట అన్నట్లుగా నాలుగు రోజుల్లో తన సంతకం పెట్టటం నేర్చేసుకుంది సుజాత. దీనిపై సుజాత మాట్లాడుతూ..సంతకం నేర్చుకోవటానికి ప్రతీరోజూ బడికి వస్తున్నానని..నాలుగు రోజుల్లో తన సంతకం చేయడం నేర్చుకున్నానని సుజాత సంతోషంగా చెప్పింది. ఆమె పట్టుదలను టీచర్లతో పాటుస్థానికులంతా ప్రశంసిస్తున్నారు.