నెల్లూరులో దారుణం : భార్యను బతికి ఉండగానే పూడ్చిపెట్టేసిన భర్త

  • Published By: nagamani ,Published On : June 2, 2020 / 04:52 AM IST
నెల్లూరులో దారుణం : భార్యను  బతికి ఉండగానే పూడ్చిపెట్టేసిన భర్త

తలకెక్కిన మద్యం మత్తు ఓ మహిళ చావుకు కారణమైంది. తనతో కలిసి జీవిస్తున్న మహిళను  బ్రతికిఉండగానే పూడ్చిపెట్టేశాడు ఓ దుర్మార్గుడు. ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే నిన్ను కూడా చంపేస్తాను జాగ్రత్త..అంటూ సదరు మహిళ కూతుర్ని బెదిరించాడు. తరువాత పారిపోయాడు.

అతడి బెదిరింపులకు భయపడిన ఏడేళ్ల చిన్నారి నోరు మెదపలేదు..కానీ తల్లి చావు గురించి చెప్పకుండా ఉండలేకపోయింది. అలా ఆ చిన్నారి రెండు రోజుల తరువాత అసలు విషయాన్ని బైటపెట్టటంతో ఈ దారుణం బైటపడింది. మద్యం తాగి రాక్షసుడిగా మారి ఆ దుర్మార్గుడి చేతిలో ప్రాణాలో కోల్పోయిందామె. మహిళను దారుణంగా కొట్టి పూడ్చిపెట్టేసిన ఘటన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గొట్లపాలెం గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే..గొట్లపాలెం గ్రామంలో పొన్నూరు సోములు..సుభాషిణి ఆమె కుమార్తె కలిసి ఉంటున్నారు. సుభాషిణి తన భర్తతో విడిపోయి కొంతకాలంలో సోములుతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో సోములు..సుభాషిణి కలిసి రెండు రోజుల క్రితం మద్యం తాగారు.

మద్యం మత్తు తలకెక్కటంతో ఇద్దరూ నానా యాగీ చేశారు. ఒకరినొకరు తిట్టుకున్నారు. తరువాత రాములు సుభాషిణిని కర్రతో గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు సుభాషిణి స్పృహ తప్పి పడిపోయింది. దీంతో సుభాషిణిని హాస్పిటల్ కు తీసుకెళ్లటం మానేసి అక్కడే ఉన్న చెట్ల కింద గొయ్యి తీసి పాతిపెట్టేశాడు. తరువాత అక్కడే ఉన్నసదరు మహిళ  ఏడేళ్ల కుమార్తెను ఈ విషయం ఎవరికన్నా చెబితే నిన్ను కూడా చంపేస్తానంటూ  బెదిరించాడు. తరువాత అక్కడి నుండి పరారైపోయాడు.

ఈ తరువాత రెండు రోజులకు ఆ చిన్నారి మా అమ్మను కొట్టి పూడ్చిపెట్టేశాడుఅని చెప్పటంతో అసలు విషయం బైటపడింది. దీంతో గ్రామస్తులు పాప చూపించిన స్థలానికి వెళ్లి చూడగా..మద్యం మత్తులో సుభాషిణిని పూర్తి పాతి పెట్టకపోవటంతో ఆమె చేతులు మట్టిలోంచి బైటకు కనిపించాయి. దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న సీఐ శ్రీనివాసరావు తన బృందంతో పాటు చేరుకున్నారు..అదే విషయంపై సమాచారం అందుకున్న తహశీల్దారు లాజరస్ కూడా చేరుకున్నారు. వెంటనే పాప చూపించిన స్థలంలో తవ్వి చూడగా..సుభాషిణి మృతదేహం బైటపడింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు సోములు కోసం గాలిస్తున్నారు.

Read: టార్చర్ భరించలేక భర్తను చంపిన భార్య