Adimulapu Suresh : అత్యవసర పరిస్థితి వస్తేనే స్కూళ్ల బంద్‌పై ఆలోచిస్తాం-మంత్రి సురేష్

కరోనా వల్ల రెండేళ్లుగా ఆల్ పాస్ విధానం అమలు చేశామని మంత్రి గుర్తు చేశారు. ఈ సారి పరీక్షలు నిర్వహించేలా బోధన జరుగుతోందన్నారు.

Adimulapu Suresh : అత్యవసర పరిస్థితి వస్తేనే స్కూళ్ల బంద్‌పై ఆలోచిస్తాం-మంత్రి సురేష్

Adimulapu Suresh

Adimulapu Suresh : సంక్రాంతి సెలవుల తర్వాత ఏపీలో సోమవారం(జనవరి 17) నుంచి యథావిధిగా విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. దీనిపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వల్ల రెండేళ్లుగా ఆల్ పాస్ విధానం అమలు చేశామని మంత్రి గుర్తు చేశారు. ఈసారి పరీక్షలు నిర్వహించేలా బోధన జరుగుతోందన్నారు. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోవద్దనే స్కూళ్లు నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు. అసలు.. కోవిడ్ వ్యాప్తికి, పాఠశాలలు నడపటానికి సంబంధమే లేదని మంత్రి అన్నారు. 26లక్షల మంది విద్యార్థుల్లో 90శాతం మందికి వ్యాక్సిన్ పూర్తైందని మంత్రి తెలిపారు. ఏది ఏమైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రభుత్వమే తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. విపక్షాలు తమ రాజకీయ లబ్ది కోసం విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేయొద్దని మంత్రి కోరారు.

Feet Swelling : పాదాల్లో వాపులా!…సమస్యేంటో తెలుసుకోవాల్సిందే?

”రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు సంక్రాంతి సెలవుల తర్వాత మొదలయ్యాయి. విద్యార్థుల రోజువారీ హాజరు తీసుకుంటున్నాం. విద్యార్థుల ఆరోగ్యం గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరీక్షలు నిర్వహించేలా పాఠశాలల్లో భోదన జరుగుతోంది. కోవిడ్ కారణంగా రెండేళ్లు ఆల్ పాస్ విధానం అనుసరించాం. భవిష్యత్తులో విద్యార్థులకు ఎదురయ్యే ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం.

26లక్షల మంది విద్యార్థుల్లో 90 శాతం మందికి వ్యాక్సిన్ పూర్తి అయ్యింది. టీచర్లకు కూడా వ్యాక్సిన్ పూర్తి చేశాం. కోవిడ్ మూడో వేవ్ నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూనే పాఠ్యంశాలు పూర్తి చేస్తున్నాం. 150 రోజుల పాటు నిరంతరాయంగా స్కూళ్లు నడిచాయి. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండాలనే పాఠశాలలు నడుపుతున్నాం. కోవిడ్ వ్యాప్తికి, స్కూల్స్ నడపటానికి సంబంధం లేదు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుంది” అని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.

Indian Army: ఇండియన్ ఆర్మీ “యూనిఫామ్” గురించి 5 ఆసక్తికర అంశాలు

పొరుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తే కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూనే ఏపీ ప్రభుత్వం వాటిని నిర్వహించిందని మంత్రి గుర్తు చేశారు. ఆన్ లైన్ విద్యా బోధనకు ఓ పరిమితి ఉందన్న మంత్రి.. ప్రాధమిక, మాధ్యమిక విద్యకు అది ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. విద్యార్థులు క్యారియర్లు అయినప్పటికీ వారికి వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు.

కాగా, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు పొడిగించింది. జనవరి 30వ తేదీ వరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చింది. అదే రీతిలో ఏపీలోనూ విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు పొడిగిస్తుందని అంతా అనుకున్నారు. అయితే, స్కూళ్లకు సెలవులు పొడిగించే ఆలోచన లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.