కరోనాతో ప్రపంచమంతా స్థంభించినా..పోలవరం పనులు జరుగుతునే ఉన్నాయి | Minister Anil Kumar Yadav comments

AP : కరోనాతో ప్రపంచమంతా స్థంభించినా..పోలవరం పనులు జరుగుతునే ఉన్నాయి

కరోనాతో ప్రపంచం అంతా స్థంభించిపోయింది. కానీ పోలవరం ప్రాజెక్టు పనులు మాత్రం ఆగకుండా జరుగుతున్నాయని కారణంగా ప్రపంచం అంతా స్తంభించినా పొలవరం పనులు సాగుతున్నాయని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఇంతటి క్లిష్ట పరిస్థితిలో కూడా పోలవరం ప్రాజెక్టు పనులు జరిగేలా సీఎం చేస్తున్నారని తెలిపారు.

AP : కరోనాతో ప్రపంచమంతా స్థంభించినా..పోలవరం పనులు జరుగుతునే ఉన్నాయి

Minister Anil Kumar Yadav comments : కరోనాతో ప్రపంచం అంతా స్థంభించిపోయింది. కానీ పోలవరం ప్రాజెక్టు పనులు మాత్రం ఆగకుండా జరుగుతున్నాయని కారణంగా ప్రపంచం అంతా స్తంభించినా పొలవరం పనులు సాగుతున్నాయని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఇంతటి క్లిష్ట పరిస్థితిలో కూడా పోలవరం ప్రాజెక్టు పనులు జరిగేలా సీఎం చేస్తున్నారని అన్నారు. దీంతో సీఎం జగన్ కు మంచి పేరు వస్తుందని టీడీపీ కుళ్లుకుంటోందని అందుకే పోలవరం పనులు అడ్డుకోవాలని టీడీపీ యత్నిస్తోందని ఆరోపించారు.

ఎలా అయినా పోలవరం పనులు అడ్డుకోవాలని పలు రకాలుగా యత్నిస్తోందనీ..అందుకే ఇరుకున పెట్టేందుకు ఎక్కడలేని యత్నాలు చేస్తోందని విమర్శించారు. అందుకే రఘురామ కృష్ణ రాజుతో కూడా లేఖలు రాయించారని..ఆరోపించారు. కరోనా మహమ్మారితో పోలవరం ప్రాజెక్టు పనులు చేసే ఇంజినీర్లను కూడా కోల్పోయామని మంత్రి విచారం వ్యక్తంచేశారు.ఎమ్మెల్యేగా ఓడిపోయిన లోకేష్ కు ఎమ్మెల్సీ పదవి కాలం పూర్తకాబోతోందనీ..ఇక టీడీపీకి ఎమ్మెల్సీ వచ్చే పరిస్థితి లేదు..కనుచూపు మేరలో టీడీపీకి రాజ్యసభ వచ్చే అవకాశం కూడా లేదని..జెడ్పిటిసి ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్ రాదేమోనని లోకేష్ పోటీలో నిలబడలేదని అందుకే ఫ్రస్ట్రేషన్ తో లోకేష్ రగిలిపోతున్నారని ఎద్దేవా చేశారు.

ఇక్కడ జెండా పీకేశారు కాబట్టే ముందు చూపుతో చంద్రబాబు హైదరాబాద్ లో ఇళ్ళు కట్టుకున్నారనీ..జగన్ ను ఆముల్ బేబీ అంటే…. లోకేష్ ను హెరిటేజ్ దున్నపోతు అనాలని ఎద్దేవా చేశారు. గడ్డం పెంచితే లోకేష్ మాస్ లీడర్ అయిపోతారా? మాస్ లీడర్ అవ్వాలంటే బ్లడ్ లో ఉండాలనీ..లోకేష్ ఇప్పటికే ఇంట్లో దాక్కుని కొడుకుకి సైకిల్ నేర్పించుకుంటున్నారని మాటల తూటాలు పేల్చారు.రాష్ట్రానికి రావాల్సిన నిధులు పై జగన్ ఢీల్లీలో ప్రస్తావిస్తారని అందుకే సీఎం జగన్ ఢిల్లీ పయనమయ్యారని వెల్లడించారు. తెలంగాణలో ఇల్లు కట్టుకుని ఏపీ ఆత్మగౌరవం అని చంద్రబాబు మాట్లాడుతురని విమర్శించారు.

×