మండలి మంటలు : ఛైర్మన్ ఏమని అనుకుంటున్నావ్ ? పార్టీ ఆఫీసు అనుకుంటున్నావా ? 

  • Published By: madhu ,Published On : January 23, 2020 / 08:13 AM IST
మండలి మంటలు : ఛైర్మన్ ఏమని అనుకుంటున్నావ్ ? పార్టీ ఆఫీసు అనుకుంటున్నావా ? 

ఏపీ శాసనమండలి ఛైర్మన్ ఏమని అనుకుంటున్నారు..పార్టీ ఆఫీసు అనుకుంటున్నాడా ? పార్టీ కార్యకర్త అనుకుంటున్నాడా ? ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులం..రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ఇక్కడకు వచ్చిన వ్యక్తులం. ఆఫ్ట్రాల్ ఆయన ఎంత ? ఆయనకు ఎవరు ఇచ్చారు హక్కు ? మండలిలో సెల్ ఫోన్‌లు ఎవరు తీసుకొచ్చారు ? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ మంత్రి బొత్స.

ఏపీ శాసనమండలిలో జరిగిన పరిణామాలపై ఏపీ మంత్రులు స్పందించారు. 2020, జనవరి 23వ తేదీ గురువారం మీడియాతో ఏపీ మంత్రి బొత్స మాట్లాడారు. మండలిలో వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుకోవడం దారుణమన్నారు.

ఎన్ని అడ్డంకులు ఎదురైనా..ఎన్ని కుట్రలు చేసినా..తమ విధానాన్ని అమలు చేస్తామన్నారు బొత్స. తప్పు చేశానని స్వయంగా ఛైర్మన్ చెప్పారని వివరించారు. సెలెక్ట్ కమిటీకి పంపించొద్దని సగం మంది సభ్యులు చెప్పారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయినా రూల్స్ ప్రకారం వెళ్లలేదన్నారు. మెజార్టీ సభ్యులు చెప్పినప్పుడు సెలెక్ట్ కమిటీకి ఎలా పంపిస్తారని సూటిగా ప్రశ్నించారు. 

మండలి ఛైర్మన్ ప్రవర్తించిన తీరు దురదృష్టకరమన్నారు. అధికారపక్షం పంపిన బిల్లును మండలిలో తిప్పి పంపారనే విషయాన్ని గుర్తు చేశారు. సంఖ్యా బలం ఉందని మండలిలో టీడీపీ అడ్డగోలుగా వ్యవహరించిందని, నిబంధనల ప్రకారం నడవాలని బీజేపీ, పీడీఎఫ్ ఇతర ఎమ్మెల్సీలు చెప్పారని వివరించారు. అయితే..ఇక్కడ మాత్రం ఛైర్మన్ మాత్రం టీడీపీ అధ్యక్షుడు బాబు చెప్పినట్లు చేశారని తెలిపారు.

శాసన మండలికి ఛైర్మన్ తీరని మచ్చ తెచ్చారని, ఏ ప్రజాస్వామ్య వాదిని అడిగినా..ఇదే విషయాన్ని చెబుతారని తెలిపారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచారని, ఛైర్మన్ ఎంతో మంచి వ్యక్తి అనుకుంటే..ఆయన పవర్తించిన తీరు దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం కోరినట్లు ఛైర్మన్ వ్యవహరించిన సూచించాలన్నారు. 

* ఎవరు ఎవరిపై దౌర్జన్యం చేశారు..అర్హత లేని వారిని పదవిలో కూర్చొబెడితే ఇలానే ఉంటుందన్నారు. 
* ఎవరు తాగొచ్చారు ? యనమల అనుభవం ఇదేనా ? 
* తన తొత్తులకు, అనర్హులకు బాబు పదవులు ఇచ్చారు. 

* రాష్ట్రంలో అలజడులు, అల్లకల్లోలం సృష్టించాలన్నది బాబు ఆలోచన.
* బిల్లు ప్రవేశ పెట్టిన సమయంలో సవరణలు ఎందుకు మూవ్ చేయలేదు. 
* చేసిన చట్టాల వల్ల ఏ ఫలితం వచ్చినా..ఆ ప్రభావం తమపైనే ఉంటుంది. 
* ఇదేనా చంద్రబాబు 40 ఏళ్ల రాజనీతి. 

* ఛైర్మన్ చేసింది అనైతికం. 
* రాజ్యాంగానికి తూట్లు పొడిచారు.
* ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా ఛైర్మన్ వ్యవహరించారు. 

* దొడ్డి దారిన మండలిలోకి వచ్చి ఇలా చేస్తారా ? 

Read More : ముదురుతున్న వివాదం : సీపీకి బండి సంజయ్ 9 ప్రశ్నలు