Minister Botsa : విశాఖ భూములపై టీడీపీది తప్పుడు ప్రచారం : మంత్రి బొత్స

టు మెన్ కమిటీ భూమి విలువ రూ.197 కోట్లుగా నిర్ణయించిందని తెలిపారు. డబ్బులు కట్టాలని ఎన్‌సీసీ సంస్థకు చెప్పామని వెల్లడించారు. ప్రభుత్వానికి రూపాయి నష్టం రానివ్వబోమని స్పష్టం చేశారు.

Minister Botsa : విశాఖ భూములపై టీడీపీది తప్పుడు ప్రచారం : మంత్రి బొత్స

Minister Botsa

AP Minister Botsa Satyanarayana : విశాఖ భూములపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ భూములకు సంబంధించి టీడీపీ హయాంలోనే జీవో నెంబర్‌ 121 జారీ చేశారని తెలిపారు. తమ భూములు అంతా పారదర్శకంగా ముందుకెళ్తోందన్నారు. చంద్రబాబు హయాంలోనే ఎన్‌సీసీ సంస్థకు జీపీఏ ఇచ్చారని… కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత మార్చడానికి వీల్లేదన్నారు. కేబినెట్‌ సమావేశంలోనే మార్పులు చేర్పులు చేయాలని తెలిపారు. అందుకే తమ ప్రభుత్వం జీపీఏను ఉపసంహరించిందని తెలిపారు. విశాఖ ఎన్‌సీసీ భూముల వివాదంపై దర్యాప్తు చేస్తామని చెప్పారు.

టు మెన్ కమిటీ భూమి విలువ రూ.197 కోట్లుగా నిర్ణయించిందని తెలిపారు. డబ్బులు కట్టాలని ఎన్‌సీసీ సంస్థకు చెప్పామని వెల్లడించారు. ప్రభుత్వానికి రూపాయి నష్టం రానివ్వబోమని స్పష్టం చేశారు. విశాఖ ఎన్‌సీసీ భూముల వివాదంపై దర్యాప్తు చేస్తామని చెప్పారు. గత 3రోజులుగా విశాఖలో ఒక భూమిని ప్రభుత్వం దారా దత్తం చేసిందని.. ప్రభుత్వానికి నష్టం వచ్చిందని ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. ncc సంస్థకు ఇచ్చిన భూమి 2005లో ppp మూడ్ లో ఆ భూమిని అభివృద్ధికి ఇచ్చారని తెలిపారు. ఆ సంస్థ రూ.90 కోట్లు ప్రభుత్వానికి చెల్లించిందని తెలిపారు. అది 97ఎకరాల 10 సెంట్లు భూమి అని తెలిపారు.

Botsa On Chandrababu : టీడీపీ ఇక అధికారంలోకి రాదు, సొంత కొడుకు ఎందుకు ఓడిపోయాడు?- మంత్రి బొత్స

ప్రాజెక్టు ఆలస్యం కావడంతో ncc సంస్థతో ఒప్పందాన్ని 2013లో ప్రభుత్వం రద్దు చేసుకోవాలని భావించిందని పేర్కొన్నారు. 2014లో ncc సంస్థ హైకోర్టుకు వెళ్ళిందని.. హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిందని తెలిపారు. 2019 ఎన్నికల ముందు ncc సంస్థ రాష్ట్ర ప్రభుత్వం మ్యూచివల్ అండర్ స్టాండింగ్ కు రావడం జరిగిందని వెల్లడించారు. టూ మెన్ కమిటీ భూ విలువను అంచనా వేసిన తరువాతే భూమి ఇస్తామని తమ ప్రభుత్వం చెప్పిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం జీపీఏను ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారు.

టూ మెన్ కమిటీ భూ విలువను రూ.197 కోట్లుగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆ డబ్బును చెల్లించి రిజిస్ట్రేషన్ ఫీజ్ కట్టమని ncc సంస్థకు చెప్పామని పేర్కొన్నారు. దీంట్లో ఎక్కడ తప్పుందో చెప్పాలన్నారు. మొత్తం రిజిస్ట్రేషన్ చెయ్యమని చెబుతున్నామని తెలిపారు. తాను చెప్పింది చంద్రబాబును చెప్పమనాలని అన్నారు. చంద్రబాబు హయాంలోనే జీపీఏ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వానికి రూపాయి నష్టం రానివ్వబోమని తెలిపారు. ఈ వివాదంపై దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. ధర్నా చేసిన తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబును అడగాలని అన్నారు.