Andhra Pradesh : హీరో నాని ఏ కిరణా కొట్టు నడుపుతున్నారో ? సిద్ధార్థ్ ఎక్కడుంటాడు ?

హీరో నాని ఏ థియేటర్ పక్కన కిరాణా కొట్టు చూశారో తనకు తెలియదని...సిద్ధార్థ్ ఎక్కడుంటాడు ? ఆయన ఏపీలో ట్యాక్స్ కడుతున్నాడా ? మేం విలాసంగా బతుకుతున్నామా ? లేదో....

Andhra Pradesh : హీరో నాని ఏ కిరణా కొట్టు నడుపుతున్నారో ? సిద్ధార్థ్ ఎక్కడుంటాడు ?

Movie

AP Minister Perni Nani : ఏపీలో సినిమా టికెట్ల విషయంలో ఇంకా రగడ కొనసాగుతోంది. ఈ విషయంలో కొందరు నటులు స్పందించారు. పలు జిల్లాల్లో థియేటర్లకు తాళాలు పడ్డాయి. ఆ రకంగా టికెట్లు ఉంటే..తాము థియేటర్లు నడుపలేమని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో…అమరావతిలో ఏపీ మంత్రి పేర్ని నానితో డిస్ట్రిబ్యూటర్లు మంగళవారం సమావేశమయ్యారు. 24 మంది డిస్ట్రిబ్యూటర్లు ఈ భేటీలో పాల్గొన్నారు. ఏపీలో టికెట్‌ రేట్ల వ్యవహారంతో పాటు థియేటర్లలో తనిఖీలపై మంత్రి పేర్ని నానితో చర్చించారు. డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం ముగిశాక మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.

Read More : Special car for PM Modi: ప్రధాని మోదీ రూ.12 కోట్ల విలువైన కారు ప్రత్యేకతలు ఇవే!

టికెట్ల రేట్లపై ప్రతిపాదనలు ఇచ్చారని, వారు ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలిస్తామన్నారు. సినిమా టికెట్ల వ్యవహారంపై కమిటీ వేయడం జరిగిందన్నారు. సినిమా థియేటర్ల వర్గీకరణ, ధరలను కమిటీ నిర్ధారిస్తుందన్నారు. ఎవరి మీద తమకు కక్ష లేదని స్పష్టం చేశారాయన. ఇక నటులపై ఆయన విమర్శలు గుప్పించారు. హీరో నాని ఏ థియేటర్ పక్కన కిరాణా కొట్టు చూశారో తనకు తెలియదని ఎద్దేవా చేశారు. సిద్ధార్థ్ ఎక్కడుంటాడు ? ఆయన ఏపీలో ట్యాక్స్ కడుతున్నాడా ? మేం విలాసంగా బతుకుతున్నామా ? లేదో సిద్ధార్థ్ చూశాడా అని ప్రశ్నించారు.

Read More : AP Film Tickets : సినిమా టికెట్ల రగడ, డిస్ట్రిబ్యూటర్ల ప్రతిపాదనలు ఇవే

ఆయన స్టాలిన్ గురించో, మోదీ గురించో మాట్లాడాడేమో అని సైటైర్ వేశారు. ఏదీ ఏమైనా కోర్టు తీర్పు ప్రకారం తాము ముందుకెళ్లడం జరుగుతుందని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. భారీ బడ్జెట్‌ సినిమాలు విడుదలవుతున్న సమయంలో టికెట్‌ రేట్ల తగ్గింపు, థియేటర్లపై దాడులు, స్వచ్ఛందంగా మూసివేతలతో గందరగోళం నెలకొంది. ఈ సమస్య పరిష్కారం అవుతుందా ? లేదా ? అనేది చూడాలి.