Minister Perni Nani : రైతుల అకౌంట్లలోకి మే 13న రైతు భరోసా నగదు జమ

రైతుల బ్యాంకు అకౌంట్లలోకి మే 13న రైతు భరోసా నగదు జమ చేస్తామని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. రైతుల అకౌంట్లలో 4,050 కోట్ల రూపాయలు జము చేయనున్నట్లు పేర్కొన్నారు.

Minister Perni Nani : రైతుల అకౌంట్లలోకి మే 13న రైతు భరోసా నగదు జమ

Ap Minister Perni Nani Said The Rytu Bharosa Money Would Be Deposited Into Farmers Bank Accounts On May 13

rytu bharosa money : రైతుల బ్యాంకు అకౌంట్లలోకి మే 13న రైతు భరోసా నగదు జమ చేస్తామని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. రైతుల అకౌంట్లలో 4,050 కోట్ల రూపాయలు జము చేయనున్నట్లు పేర్కొన్నారు. రైతు భరోసాతో రాష్ట్రంలోని 54 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. రైతులకు పంట నష్టం డబ్బులు చెల్లించామని చెప్పారు.

మే 25న వైఎస్సార్ ఉచిత పంటల బీమా జమ చేస్తామన్నారు. ఉచిత పంటల బీమా కింద రూ.2,589 కోట్లు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. మే 18న వైఎస్సార్ మత్స్యకార భరోసా నగదు జమ చేస్తామని చెప్పారు. వేటకు వెళ్లే మత్స్యకారులకు రూ.10,000 చొప్పున సాయం చేస్తున్నట్లు ప్రకటించారు.

మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరిగింది. పగటి పూట కర్ఫ్యూ సహా పలు అంశాలను చర్చించారు. కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో పగటి పూట కర్ఫ్యూ అమలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజా రవాణతో పాటు, ప్రైవేటు వాహనాలు తిరగడానికి వీల్లేదని మంత్రి పేర్ని నాని తెలిపారు.