Bhogi Celebrations : భోగి సంబరాల్లో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే రోజా

ఏపీ, తెలంగాణలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భోగి సంబరాల్లో ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, వైసీపీ ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు.

Bhogi Celebrations : భోగి సంబరాల్లో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే రోజా

Bhogi Mantalu

Vellampalli and Roja Bhogi celebrations : ఏపీ, తెలంగాణలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భోగిమంటలు వెలిగించి.. పండగను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేస్తున్నారు. వేకువజామున చీకట్లను చీల్చుకుంటూ భోగి మంటల కాంతులు విరజిమ్మాయి. భోగి మంటల్లో పాత సామాగ్రి వేసి అగ్ని దేవున్ని ప్రార్థిస్తున్నారు. వాడవాడలా భోగిమంలు వేసి.. చిన్నాపెద్దా సందడి చేస్తున్నారు. సంక్రాంతి సందడితో బెజవాడ కళ కళలాడుతోంది. సంక్రాంతి సందర్భంగా నాగర వాసులు వాడ వాడలా భోగి మంటలు వేశారు. నగరంలోని అన్ని వీధుల్లో రంగవల్లులు, గంగిరెద్దుల విన్యాసాలు భోగి మంటలతో వేడుకలు అంబరాన్ని అంటాయి. పాతబస్తీలో కార్పొరేటర్లు, కార్యకర్తలతో కలిసి ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు భోగి వేడుకలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోగి పండుగను సాంప్రదాయ పద్ధతిలో ప్రజలు జరుపుకుంటున్నారని తెలిపారు. యువత పెద్ద ఎత్తున బోగి సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ది చెందే విధంగా ముందుకు వెళ్తోందన్నారు. 32 లక్షల మందికి సీఎం జగన్ సొంతింటి కలను నెరవేర్చారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యంతో అమ్మఒడి కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. కరోనా వైరస్ బోగి మంటల్లో ఆహుతి అవ్వాలని కోరుకున్నారు. పండగలను రాజకీయం చేయొద్దన్నారు. పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకొవాలని సూచించారు. జగన్ సీఎంగా ఏపీలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు.

Bhogi : తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు

చంద్రబాబు హయాంలో దేవాలయాలను కూల్చేస్తుంటే సోమువీర్రాజు ఏం చేశారని ప్రశ్నించారు. మత విధ్వేషాలను సోమువీర్రాజు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. పండగ వేళ దిక్కుమాలిన రాజకీయాలు చేయొద్దన్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ పై సోమువీర్రాజు ఎందుకు మాట్లాడరని నిలదీశారు. హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం చంద్రబాబుకి అలవాటని ఆరోపించారు. వైసీపీపై రౌడీయిజం నింద వేయాలని చంద్రబాబు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. పాత వస్తువులను ఎలా పడవేస్తామో చంద్రబాబు ఆలోచనలనూ బోగి మంటల్లో వేయాలని కోరుకుంటున్నామని తెలిపారు.

కడప జిల్లా సంబేపల్లి మండలం శెట్టిపల్లి గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి నగిరి వైసీపీ ఎమ్మెల్యే రోజా… సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. తెలుగు ప్రజలకి శుభాకాంక్షలు తెలిపారు. బంధువులతో కలిసి భోగి మంటలు వేస్తూ పండగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు పల్లెలకు వెళ్ళి పండగ చేసుకోవాలని కోరుకుంటున్నానట్లు తెలిపారు. జగనన్న పాలనలో అందరూ శుఖ సంతోషాలతో ఉన్నారని పేర్కొన్నారు. ప్రకృతి వైపరిత్యాలు వచ్చినా మంచి పాలన అందిచారని చెప్పారు. చిరంజీవి, సీఎం జగన్ భేటీ మంచి పరిణామం అన్నారు. సీఎం జగన్ ఎవరిపై కక్ష సాధింపులు చేయరని వెల్లడించారు.

50 Lakh Fine: మాస్కుల్లేని ప్రయాణికుల నుంచి రూ.50లక్షలు వసూలు చేసిన రైల్వేశాఖ

సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య వారధిగా చిరంజీవి రావడం శుభ సూచకం అన్నారు. సామాన్యులకు సినిమా అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సంక్రాంతి అనంతరం చర్చలు సఫలం అవుతాయని తెలిపారు. చంద్రబాబు కోడిగుడ్డుపై ఈకలు పీకేలా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన సొంత నియోజకవర్గంలోనే తన ఉనికిని కోల్పోతున్నారని తెలిపారు. సొంత నియోజకవర్గంలోనే టీడీపీలో అసంతృప్తి రావడంతో ఆయన మతి భ్రమించిన వ్యక్తి లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.