AP Night Curfew: ఏపీలో నైట్ కర్ఫ్యూ మొదలైంది.. వీటికి మాత్రమే అనుమతి…

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాత్రి కర్ఫ్యూకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

AP Night Curfew: ఏపీలో నైట్ కర్ఫ్యూ మొదలైంది.. వీటికి మాత్రమే అనుమతి…

Ap Night Curfew Started From Today

AP Night Curfew : ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాత్రి కర్ఫ్యూకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్‌ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుంది.

అన్ని కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, రెస్టారంట్లు, హోటళ్లు మూసివేయాలి. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే.. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కఠినంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. నైట్ కర్ఫ్యూలో వేటికి అనుమతి ఉంటుంది? వేటికి అనుమతి ఉండదో వివరాలను ఓసారి పరిశీలిద్దాం..

– రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.
– ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు, ఫార్మసీలు, అత్యవసర సేవలందించే కార్యాకలాపాలు మాత్రమే కర్ఫ్యూ సమయంలో పనిచేస్తాయి.
– నీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలు, ప్రైవేట్‌ సెక్యూరిటీ సేవలు, ఆహార సరఫరా సేవలకూ మినహాయింపు ఉంటుంది.
– నిర్దేశించిన రంగాలకు చెందిన వ్యక్తులు మినహా మిగతా వారందరి రాకపోకలపై ఆంక్షలు వర్తిస్తాయి.
– అత్యవసర సరకు రవాణా వాహనాలు, అంతర్రాష్ట్ర సరకు రవాణాకు ఎలాంటి ఆంక్షలు ఉండవు.
– వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది, అత్యవసర సేవలు, నర్సింగ్ సిబ్బంది, గర్భిణులు, విమానాశ్రయాలు
– ప్రజా రవాణాతో పాటు ఆటోలు ఇతర వాహనాలు నిర్ణీత కర్ఫ్యూ వేళల వరకూ మాత్రమే అనుమతి.
– రైల్వే స్టేషన్ల నుంచి వచ్చే వ్యక్తుల రాకపోకలకు అనుమతి ఉంటుంది.
– ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్లు, ఇంటర్నెట్, కేబుల్ సేవలకు అనుమతి.
– పెట్రోలు పంపులు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థల కార్యాలయాలకు మినహాయింపు