ఏపీ పంచాయతీ ఎన్నికలు : తొలి విడత నామినేషన్ల తిరస్కరణ

ఏపీ పంచాయతీ ఎన్నికలు : తొలి విడత నామినేషన్ల తిరస్కరణ

ap panchayat elections : ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీలో 13 వందల 23 నామినేషన్లను తిరస్కరించారు అధికారులు. 12 జిల్లాల్లోని 3 వేల 249 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవి కోసం 19 వేల 491 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. వాటిలో 18 వేల 168 మాత్రమే పోటీకి అర్హత పొందారని ఎస్‌ఈసీ ప్రకటించింది. 32 వేల 502 వార్డులకు 79 వేల 799 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 77 వేల 554 నామినేషన్లు మాత్రమే సరిగ్గా ఉన్నట్టు నిర్ధారించారు. వార్డు సభ్యులకు సంబంధించి మొత్తం 2 వేల 245 నామినేషన్లను తిరస్కరించారు అధికారులు.

మరోవైపు రెండో విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. తొలి రోజు నామినేషన్లు ఓ మోస్తరుగా దాఖలయ్యాయి. 2021, ఫిబ్రవరి 04వ తేదీ గురువారం నామినేషన్లకు చివరితేదీ కావడంతో బుధవారం భారీ సంఖ్యలో దాఖలయ్యే అవకాశాలున్నాయి. రెండో దశలో మొత్తం 3 వేల 335 పంచాయతీల సర్పంచ్‌లకు, 33 వేల 632 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో దశ పోలింగ్‌ 13వ తేదీన నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్‌ చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.