Latest
AP Parishad Election : ఏపీ పరిషత్ ఫైట్, 3 జిల్లాలో రీ పోలింగ్
ఏపీలో పరిషత్ ఫైట్ 2021, ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం కూడా కొనసాగనుంది. కొన్ని కారణాలతో 3 జిల్లాల పరిధిలో ఆగిపోయిన చోట రీ-పోలింగ్ ప్రారంభం కానుంది.
Home » Andhrapradesh » AP Parishad Election : ఏపీ పరిషత్ ఫైట్, 3 జిల్లాలో రీ పోలింగ్
ఏపీలో పరిషత్ ఫైట్ 2021, ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం కూడా కొనసాగనుంది. కొన్ని కారణాలతో 3 జిల్లాల పరిధిలో ఆగిపోయిన చోట రీ-పోలింగ్ ప్రారంభం కానుంది.
Publish Date - 6:24 am, Fri, 9 April 21
Re-Polling : ఏపీలో పరిషత్ ఫైట్ 2021, ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం కూడా కొనసాగనుంది. కొన్ని కారణాలతో 3 జిల్లాల పరిధిలో ఆగిపోయిన చోట రీ-పోలింగ్ ప్రారంభం కానుంది. విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేటలో రీ-పోలింగ్ జరగనుంది. అంటిపేట ఎంపీటీసీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న నిర్మల పేరుకు బదులు వేరే పేరును బ్యాలెట్‌పేపర్‌పై ముద్రించడంతో.. నిన్న పోలింగ్ నిలిపివేశారు. నెల్లూరు జిల్లా AS.పేట మండలం పొనుగుపాడులో బ్యాలెట్ బాక్సును ఓ పార్టీ ఏజెంట్ నీటితొట్టెలో వేయడంతో.. అక్కడ కూడా నిన్న పోలింగ్ నిలిచిపోయింది.
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రాలు తారుమారయ్యాయి. ఈ మూడు జిల్లాల్లో రీ పోలింగ్ జరగనుంది. గుంటూరు జిల్లా ఉయ్యందనలో రిగ్గింగ్‌పై కలెక్టర్ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
ఇక పరిషత్ ఎన్నికల్లో మందకొడిగా ఓటింగ్ జరిగింది. స్థానిక ఎన్నికల్లో ఎప్పుడూ దాదాపు 80 శాతం మేర జరిగే పోలింగ్.. ఈసారి కేవలం 60.91శాతంగానే నమోదైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2014లో జరిగిన ఎన్నికల్లో 13 జిల్లాల్లో కలిపి 81శాతం పోలింగ్ రికార్డయింది. అప్పటి కంటే ఇప్పుడు ఏకంగా 20 శాతం మంది తక్కువగా ఓట్లేశారు.
Read More : Bombay HC :’ఇదేం పిచ్చి వాదన?వేస్టు మాటలు మాని..పాయింట్స్ మాట్లాడండీ లాయర్ గారూ : జడ్జీ చీవాట్లు
Bobbili Veena : బొబ్బిలి వీణకు…కరోనా కాటు..
CBI JD Lakshmi Narayana : పొలంబాట పట్టిన మాజీ సిబిఐ జేడి….కౌలురైతుగా సేద్యంలోకి…
Suckker Fish : తినటానికి పనికిరాదు కానీ…పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది… వింత చేపతో తంట…
Tenth, Inter Exams : ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
Suicide : పరువు కోసం తల్లి.. ప్రేమ కోసం కూతురు…
100 Years ‘Artos’ drink : పక్కా లోకల్..ఆయ్..ఇది గోదారోళ్ల డ్రింకండీ..ఒక్క గుక్క తాగితే సూపర్ అంటారండీ బాబూ