AP డాక్టర్ల ఘనత : రోగికి Bigg boss షో చూపిస్తూ బ్రెయిన్ ఆపరేషన్ చేసిన డాక్టర్లు

  • Published By: nagamani ,Published On : November 21, 2020 / 11:10 AM IST
AP డాక్టర్ల ఘనత : రోగికి Bigg boss షో చూపిస్తూ బ్రెయిన్ ఆపరేషన్ చేసిన డాక్టర్లు

Ap Guntur Patient brain operation watching big boss show : నీకు ఆపరేషన్ చేయాలయ్యా అని డాక్టర్ చెబితే చాలు భయపడిపోయేవాళ్లం. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఆపరేషన్ చాలా ఈజీగా చేసేస్తున్నారు డాక్టర్లు. ఎంత ఈజీగా అంటే పేషెంట్ కు మత్తు మందు ఇవ్వకుండానే మెలకువగా ఉండగానే ఏమాత్రం నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేసేస్తున్నారు. అటువంటి అరుదైన అద్భుతమైన ఆపరేషన్ చేశారు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులోని డాక్టర్లు.



ఆ పేషెంట్ ఆపరేషన్ చేసే సమంలో ఎంత ఖుషీగా ఉన్నాడంటే..డాక్టర్లు ఆ పేషెంట్ కు వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయని ‘బిగ్ బాస్’ షో, అవతార్ సినిమాను చూపిస్తూ అత్యంత చాకచక్యంగా విజయవంతంగా ఆపరేషన్ చేశారు.
https://10tv.in/cm-to-lay-stone-for-ameenabad-fishing-harbour-virtually/


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు మండలం పాటిబండ్లకు చెందిన వరప్రసాద్ అనే 33 ఏళ్ల వ్యక్తి బెంగళూరులో స్టాఫ్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. అతను తరచూ ఫిట్స్‌ వచ్చి పడిపోతుండటంతో స్కానింగ్ చేయించగా బ్రెయిన్ లో ట్యూమర్ ఉందని ఆపరేషన్ చేయాలని చెప్పారు డాక్టర్లు. దీంతో అతని 2016లో హైదరాబాద్‌లోని ఓ బ్రెయిన్ ట్యూమర్‌ ఆపరేషన్ చేయించుకున్నాడు. సర్జరీ తరువాత రేడియోథెరపీ కూడా చేశారు.



కానీ ఇటీవల కొన్ని నెలలుగా వరప్రసాద్ కు మళ్లీ ఫిట్స్ వచ్చి పడిపోతుండటంతో మరోసారి డాక్టర్ల వద్దకెళ్లాడు. గుంటూరులోని బ్రింద న్యూరోసెంటర్‌ లో చేరాడు. పరీక్షలు చేయగా మెదడులో కణితి మళ్లీ పెరుగుతోందనీ వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. దానిని తొలగించేందుకు మెదడు త్రీడీ మ్యాప్‌ను సిద్ధం చేసుకుని కణితి ఎక్కడుందో గుర్తించి సరిగ్గా అక్కడ మాత్రమే కపాలాన్ని తెరిచి ఆపరేషన్ చేసి తొలగించాల్సి ఉంది.



అయితే..మనిషి మాట్లాడేందుకు ఎంతో కీలకమైన ప్రాంతంలో ఆపరేషన్ చేయాల్సి రావడంతో సీనియర్ న్యూరాలజిస్టులు అప్రమత్తంగా వ్యవహరించారు. అతడిని మెలకువగా ఉంచి, మాట్లాడిస్తూ.. టీవీలో బిగ్‌బాస్ షో, అవతార్ సినిమాను చూపిస్తూ విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. రోగి వరప్రసాద్‌కు ఆపరేషన్ చేసిన వైద్యులలో ముగ్గురు గుంటూరు సర్వజన ఆసుపత్రికి చెందిన వారు కావడం గమనించాల్సినవిషయం. వరప్రసాద్ పూర్తిగా కోలుకోవడంతో నిన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూడా చేశారు. కాగా వరప్రసాద్ కు హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉండటంతో ఒక్క పైసా కూడా ఖర్చు కాలేదని డాక్టర్లు తెలిపారు.



కాగా వరప్రసాద్ తలకు ఎంఆర్‌ స్పెక్ట్రో స్కోపీ, పర్‌ఫ్యూజన్‌ స్కాన్‌ చేసి ప్రధానమైన పెద్ద రక్తనాళం పక్కన ప్రీ మోటార్‌ ప్రాంతంలో ట్యూమర్‌ ఉంది. దాన్ని అత్యంత జాగ్రత్తగా చాకచక్యంగా తొలగించాల్సి వచ్చింది. నవంబర్ 10న న్యూరో నావిగేషన్, మోడరన్‌ మైక్రోస్కోప్‌ వినియోగించి త్రీడీ టెక్నాలజీ ద్వారా ఆపరేషన్‌ చేసామని ప్రముఖ న్యూరోసర్జన్‌ డాక్టర్‌ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి శుక్రవారం (నవంబర్ 20,2020) తెలిపారు. ఆపరేషన్‌ సమయంలో రోగికి బిగ్‌బాస్‌ షో చూపిస్తూ ఉండగా హీరో నాగార్జున పాటలను రోగి కాపాడామని తెలిపారు. షో అయిపోయాకు రోగి వరప్రసాద్ కు ఇష్టమైన అవతార్‌ సినిమాను చూపిస్తూ..మధ్య మధ్యలో మాట్లాడుతూ ఆపరేషన్‌ పూర్తి చేశామని తెలిపారు.



బ్రెయిన్‌లో నుంచి మూడు సెంటీమీటర్ల ట్యూమర్‌ను తీసే సమయంలో వరప్రసాద్‌ తన మెడ వెనుక ఏదో తేడా వస్తున్నట్టు చెప్పాడని..వెంటనే వేరే డైరెక్షన్‌లో బ్రెయిన్‌లో నుంచి ట్యూమర్‌ను బయటకు తీసి రోగి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం రాకుండా చేశామని తెలిపారు.ఈ ఆపరేషన్ గంటన్నర సమయం పట్టిందని..ఈ ఆపరేషన్ లో తనతో పాటుగా సీనియర్‌ న్యూరోసర్జన్‌ డాక్టర్‌ డి.శేషాద్రిశేఖర్, మత్తు వైద్యనిపుణుడు డాక్టర్‌ బి.త్రినాథ్‌ పాల్గొన్నారని న్యూరోసర్జన్‌ డాక్టర్‌ భవనం హనుమ శ్రీనివాసరెడ్డితెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అవేక్‌ బ్రెయిన్‌ సర్జరీ తామే మొట్టమొదటిసారిగా చేశామని ఇది తెలిపారు.పేషెంట్ త్వరగా కోలుకోవటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
https://youtu.be/zoHOP1CZxk8