Andhra Pradesh : కక్షతో అక్రమ అరెస్టులు, మా డబ్బులు ఇచ్చే వరకు పోరాడుతునే ఉంటాం : వాణిజ్య పన్నుల శాఖ సర్వీస్ అసోసియేషన్

ఫ్యాక్షనిస్ట్ ల్లాగా దౌర్జన్యంగా వచ్చి రెస్ట్ చేశారు.మా నాన్న డయాబెటిస్ పేషెంట్..స్టంట్ కూడా వేశారు..మా నాన్నను ఏం చేశారో అంటూ మెహర్ కుమారుడు ఆందోళన వ్యక్తంచేశారు. మానాన్నను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కానీ ఏ పోలీస్ స్టేషన్ లోను కనిపించలేదు. ఆయన ఎక్కడ వున్నారో తెలియడం లేదు. అసలు అది అరెస్టో లేదా మరేదన్నానో అని భయపడుతున్నాం అంటూ వాపోయారు.

Andhra Pradesh : కక్షతో అక్రమ అరెస్టులు, మా డబ్బులు ఇచ్చే వరకు పోరాడుతునే ఉంటాం :  వాణిజ్య పన్నుల శాఖ సర్వీస్ అసోసియేషన్

AP Commercial Taxes Service employees arrested

Andhra Pradesh Employees : ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ సర్వీస్ అసోసియేషన్ కు చెందిన నలుగురు ఉద్యోగులను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీఎస్టీవో మెహర్ కుమార్, డిప్యూటి అసిస్టెంట్ కమీషనర్ సంధ్య, సీనియర్ అసిస్టెంట్ చలపతి, ఆఫీస్ సబార్డినేట్ సత్యనారాయణలను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులపై ఉద్యోగ సంఘం నేతలు వ్యతిరేకిస్తున్నారు. అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు. మఫ్టీలో వచ్చిన పోలీసులు గుడివాడలో ఇద్దరు, విజయవాడలో మరో ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నట్టు చెబుతున్నారు. గుడివాడలో డిప్యూటీ కమిషనర్ సంధ్యను కూడా పోలీసులు తీసుకు వెళ్లారని ఆరోపిస్తున్నారు.

కాగా గతంలో ఈ నలుగురు ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కానీ వీరంతా హైకోర్టుకు వెళ్లి రిలీఫ్ పొందారు. హైకోర్టు వారి సస్పెన్షన్ ఎత్తివేస్తు తీర్పునిచ్చింది. దీంతో వీరింతా తిరిగి డ్యూటీల్లో చేరారు. ఈక్రమంలో మరోసారి అరెస్ట్ చేయటంపై మండిపడుతున్నారు. ఇటీవల వీరంతా గవర్నర్ ను కలిశారు.అందుకే ప్రభుత్వం తమపై కక్ష కట్టి ఇలా మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేశారని మండిపడుతున్నారు. ఉద్యోగుల అరెస్టులపై ఏపీ వాణిజ్య పన్నుల సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు, ఏపీ వాణిజ్య పన్నుల సర్వీసెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ తో పాటు అరెస్ట్ అయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు  మీడియా ముందుకొచ్చారు. అక్రమ అరెస్టులను ఖండించారు.

గవర్నర్ ను కలిసినందుకే కక్షతో అక్రమ అరెస్టులు : సూర్యనారాయణ
ఈ అరెస్టులపై ఏపీ వాణిజ్య పన్నుల సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మాట్లాడుతు..తమకు 1వ తేదీన జీతాలు అందంటంలేదని దీంతో తాము ఇబ్బందులకు గురి అవుతున్నామని అదే అంశంపై తాము ఇటీవల గవర్నర్ ను కలిసి జీతాలు సకాలంలో ఇప్పించాలని..ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలు ఇప్పించాలని కోరుతు వినతిపత్రం ఇచ్చామని..అందుకే ప్రభుత్వం తమపై కక్ష కట్టి ఇలా అక్రమంగా అరెస్టులతో భయపెట్టాలను చూస్తోంది అంటూ ఆరోపించారు. ఉద్యోగులపై ప్రభుత్వం కక్ష సాధింపులు మానుకోవాలని కోరారు. ఎప్పుడో రెండేళ్ల క్రితం పేపర్ లో వచ్చిన వార్తను పట్టుకొని ఉద్యోగులను సస్పెన్షన్ చేశారని కానీ న్యాయస్థానంలో ఎటువంటి తప్పు చేయలేదని నిరూపించుకున్నామని..తమ సస్పెన్షన్ ను కోర్టు కొట్టివేసిందని దాంతో ఉద్యోగులు తిరిగి డ్యూటీల్లో చేరారని తెలిపారు. కేవలం తాము గవర్నర్ ను కలిసినందుకే ఇలా కక్ష సాధిస్తున్నారంటూ ఆరోపించారు.

అరెస్టులా? మరేదైనానా?.. మఫ్టీల్లో వచ్చి అరెస్టులేంటీ: సూర్యనారాయణ
అప్పట్లో తొమ్మిది మందిపై మొత్తం విచారణకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఇంకా అమలు కాలేదని..అరెస్ట్ అయిన మా ఆఫీస్ బేరర్లలో ఒకరి ఇంట్లో పెళ్లి, మరొకరికి ఇటీవల హార్ట్ స్టంట్ వేశారని..అరెస్ట్ చేసి వారు ఏ కేసులో వీరిని అరెస్ట్ చేశారో, ఎక్కడికి తీసుకవెళ్లారో కూడా కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా మఫ్టీల్లో వచ్చి తీసుకెళ్లిపోయారని ఇది అన్యాయమని కనీసం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా ఇటువంటి చర్యలు అక్రమం అని మండిపడ్డారు సూర్యనారాయణ.

అక్రమంగా అరెస్టులతో భయపెట్టాలనుకుంటే భయపడేది లేదు : సూర్యనారాయణ
సస్పెండులు చేస్తు..ఇలా అక్రమంగా అరెస్టులు చేసి భయపెట్టాలనుకుంటే అది జరగదని ఇటువంటివాటికి తాము భయపడమని స్పష్టంచేశారు. ఉద్యోగులకు ఇలా ఇబ్బందులకు గురిచేస్తు నేరం చేసినవారిని అరెస్ట్ చేసినట్లుగా చేస్తున్న ఇటువంటి చర్యలపై ఛీఫ్ సెక్రెటరీ ఉద్యోగుల అరెస్ట్ పై నోరు మెదపాలని డిమాండ్ చేశారు. తప్పు చేసినవారిపై చర్యలు తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు. వారి నిజాయితీ వారు నిరూపించుకుంటారు. ఈ అరాచకంగా ప్రభుత్వం ప్రవర్తించడం న్యాయమా? అని ప్రశ్నించారు ఏపీ వాణిజ్య పన్నులశాఖ సర్వీసస్ అసోషియేషన్ అధ్యక్షులు సూర్యనారాయణ.

సిఎస్ గారూ మీరు దొంగిలించిన మా జిపిఎఫ్ డబ్బులు ఇచ్చేంత వరకు పోరాడతాం
ఈ కేసు ఏ ఏజన్సీ విచారణ చేస్తోందో తెలియటంలేదని..సిఎస్ గారూ మీరు దొంగిలించిన మా జిపిఎఫ్ డబ్బులు తిరగీ ఇచ్చేంత వరకు మేం పోరాటం చేస్తూనే వుంటాం..ఇటువంటి అరెస్టులకు భయపడం అని స్పష్టంచేశారు.వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగులారా మీరు భయపడొద్దు..కలిసి ఇటువంటి అన్యాయాలు,అక్రమాలపై పోరాడదాం అని పిలుపునిచ్చారు.మా ఉద్యోగులను ఎత్తుకపోయిన పోలీస్ లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రేపు హైబియస్ కార్పస్ పిటీషన్ వేస్తామని తెలిపారు. కులాలను చూసి అరెస్టులు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. ఈ కేసులో కొంతమంది ఉన్నతాధికారుల పేర్లు కూడా ఉన్నాయి. కానీ వారిపై మాత్రం ఎటువంటి చర్యలు లేవు అని తెలిపారు.

అక్రమ అరెస్టులపై ప్రభుత్వం స్పందించాలి : అస్కార్ రావు
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు మాట్లాడుతు..చట్ట విరుద్ధంగా ఉద్యోగులను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అసలు అవి అరెస్టులో లేదా మరేదన్నా చేయటానికి తీసుకెళ్లిపోయారు అర్థం కావట్లేదని అన్నారు.అనైతిక చర్యలను సహించమన్నారు.అరెస్టుల పేరుతో ఇలా ఉద్యోగులను దౌర్జన్యంగా తీసుకెళ్లిపోవటంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని.. సీఎస్ విధానాలు మార్చుకోవాలి. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

జగన్ కు ఓటు వేసినందుకు ఇదా మాకు దక్కింది : అటెంబర్ సత్యనారాయణ భార్య సుజాత..
నా భర్తను ఎక్కడికీ తీసుకవెళ్లారో తెలియదు.నా భర్తను అరెస్ట్ చేసినట్లుగా వారి భార్యా బిడ్డలను అరెస్ట్ చేస్తే ఊరుకుంటారా? అని ఆవేదనతో ప్రశ్నించారు అటెండర్ సత్యనారాయణ భార్య సుజాత. నాకు ఉన్నది ఒక్క కూతురు…అటెండర్ ఏం కుంభకోణ చేస్తాడు? ఏం నేరం చేశారని నా భర్తను ఇలా అరెస్ట్ చేశారు? అని ప్రశ్నించారు.నేను జగన్ కు ఓటు వేశాను. ఓటు వేసినందుకు ఇదా మాకు దక్కిన ప్రతిఫలం అని ప్రశ్నించారు.

ఫ్యాక్షనిస్ట్ ల్లాగా వచ్చి నా భార్య సంధ్యను తీసుకెళ్లిపోయారు : సంధ్య భర్త శివరామిరెడ్డి
ఫ్యాక్షనిస్ట్ ల్లాగా దౌర్జన్యంగా వచ్చి నా భార్య సంధ్యను అరెస్ట్ చేశారు. అంటూ అరెస్ట్ అయిన ఉద్యోగిని సంథ్య భర్త శిమరామిరెడ్డి మండిపడ్డారు. మా డ్రైవర్ కంగారుతో ఫోన్ చేశాడు. వెంటనే నా భార్యను కిడ్నాప్ చేశారని పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేశానని తెలిపారు. 100 కు రెండు సార్లు ఫోన్ చేసినా వాళ్లు చాలా దురుసుగా సమాధానం చెప్పారని వాపోయారు. పోలీసులు ఏం చేయాలని నా భార్యను తీసుకువెళ్లారు? అని ప్రశ్నిచారు. నా పిల్లలు చిన్నవాల్లు వాళ్లు అమ్మకోసం ఏడుస్తున్నారు నా భార్యను ఏం చేస్తారో అనే ఆందోళనగా ఉంది అంటూ మీడియా ముందు వాపోయారు శివరామిరెడ్డి. రౌడీల్లాగా మానభం చేసే వారిలాగా నా భార్యను తీసుకవెళ్లారని అంటూ ఘాటు విమర్శలు చేశారు. నా భార్యకు ఏమైనా జరిగితే నా జీవితం వృధా..నా పిల్లల పరిస్థితి ఏంటీ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.ఈ దారుణంపై డీజీపీ సమాధానం చెప్పాలని ఉద్యోగిని సంధ్య భర్త శిమరామిరెడ్డి డిమాండ్ చేశారు.

అరెస్ట్ చేసి ఏ పీఎస్ లోనే లేరు..మానాన్నను ఏం చేశారు : మెహర్ భార్య, కుమారుడు
కనీసం నా ఫోన్ ను కూడా లిఫ్ట్ చేయనివ్వలేదు అంటే మరో ఉద్యోగి మెహర్ భార్య వాపోయారు. మా నాన్న డయాబెటిస్ పేషెంట్..స్టంట్ కూడా వేశారు..మా నాన్నను ఏం చేశారో అంటూ మెహర్ కుమారుడు ఆందోళన వ్యక్తంచేశారు. మానాన్నను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కానీ ఏ పోలీస్ స్టేషన్ లోను కనిపించలేదు. ఆయన ఎక్కడ వున్నారో తెలియడం లేదు. అసలు అది అరెస్టో లేదా మరేదన్నానో అని భయపడుతున్నాం అంటూ వాపోయారు.