AP Politics : వైసీపీ ఎమ్మెల్యే తీరుతో పెరుగుతున్నఅసంతృప్తి..క్యాష్ చేసుకునేందుకు రంగంలోకి టీడీపీ నేతలు

వైసీపీ ఎమ్మెల్యే తీరుతో ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఈ పరిస్థితిని చేసుకునేందుకు రంగంలోకి దిగారు టీడీపీ నేతలు.

AP Politics : వైసీపీ ఎమ్మెల్యే తీరుతో పెరుగుతున్నఅసంతృప్తి..క్యాష్ చేసుకునేందుకు రంగంలోకి టీడీపీ నేతలు

Ycp Mla Errakota Chennakesava Reddy

AP Kurnool District Emmiganur Politics : ఏ నియోజకవర్గంలోనైనా.. ఎమ్మెల్యే అంటే అందరికీ నచ్చుతారా చెప్పండి. నచ్చరు.. కొందరు అసలే మెచ్చరు. ఎంతో కొంత వ్యతిరేకత కామన్. ఆ కొంత వ్యతిరేకతను.. పూర్తిగా వాడేసుకోవాలని డిసైడ్ అయిపోయారు అపొజిషన్ పార్టీ లీడర్లు. ఆ నేటివిటీలో ఎమ్మెల్యేపై జనంలో ఉన్న నెగటివిటీని.. తమకు పాజిటివ్‌గా మార్చుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రజల్ని మెప్పించేందుకు.. ఓట్లు గెలిచేందుకు పాట్లు పడుతున్నారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో.. అధికార పార్టీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి వ్యవహారశైలి.. లోకల్‌ పబ్లిక్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక్కో ప్రాంత ప్రజల్ని.. ఒక్కోలా చూస్తున్నారని.. అక్కడి జనం చెవులు కొరుక్కుంటున్నారట. వయోభారంతో.. ఇంటికే పరిమితమైన ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి.. గ్రామాల్లో పర్యటించకపోవడంతో.. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని.. సొంత పార్టీ నేతల్లోనూ గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఇలాగైతే.. ఎన్నికల్లో ఓట్లు అడిగిన జనాలకు.. ఏం మొహం పెట్టుకొని.. తమ మొహం చూపించాలని.. సెకండ్ కేడర్ లీడర్లంతా.. ఒకరికొకరు చెప్పుకుంటూ.. తెగ ఫీలైపోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

Also read : T.Congress : కొత్తగూడెం కాంగ్రెస్‌లో కొత్త పంచాయతీ..ఇద్దరు నేతల మధ్య పోటీ..కార్యకర్తల్లో కన్ఫ్యూజన్

ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి.. తనకు పట్టున్న గ్రామాలపై చూపుతున్న ప్రేమ.. ఎమ్మిగనూరు టౌన్‌తో పాటు ఇతర ప్రాంతాల ప్రజలపై చూపడం లేదని.. అభివృద్ధి విషయం పట్టించుకోవడం లేదని.. కొందరు వైసీపీ నేతలు, గ్రామీణ ప్రాంతాల్లోని.. ప్రజాప్రతినిధులు అసంతృప్తితో ఉన్నారు. ఇదే కరెక్ట్ టైం అనుకొని.. జనంలో ఉన్న వ్యతిరేకత.. వైసీపీ కేడర్‌లో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలని.. తెలుగుదేశం నేతలు ప్రయత్నిస్తున్నారు.

రెండేళ్లుగా హైదరాబాద్‌లో మకాం వేసిన ఎమ్మిగనూరు టీడీపీ ఇంచార్జ్.. జయనాగేశ్వర రెడ్డి.. ఇప్పుడు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. గాలి ఎక్కువొచ్చి.. దుమ్ములేవడంతో.. నార్మల్‌గానే పర్యటించాలని లోకల్ జనమే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. జయ నాగేశ్వర రెడ్డికి దీటుగా.. కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వర్గం కూడా ఎమ్మిగనూరులో పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం.. కోట్ల వర్గం ఎమ్మెల్యే తీరును ఎండగడుతూ.. జనంలోకి వెళ్లిపోతున్నారు.

Also read : AP politics : మంత్రి వర్గ విస్తరణ తర్వాత కొత్త బాధ్యతలతో తల పట్టుకున్న మాజీ డిప్యూటీ సీఎం

ఎమ్మిగనూరు టీడీపీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు.. బీవీ, కోట్ల తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం.. ప్రీ క్యాంపెయిన్ చేసుకుంటున్నారు. ఎవరికి వారు.. పోటాపోటీగా తమ ప్రాబల్యం పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.