AP Politics : YCPలో టికెట్ రగడ..కొడాలి వ్యాఖ్యలతో మరోసారి హీటెక్కిన గన్నవరం రాజకీయం..

అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతున్న అధికార వైసీపీ పార్టీలో గన్నవరం రాజకీయం ఎప్పటికప్పుడు హీట్ లోనే ఉంటుంది. ఏపీ పాలిటిక్స్ లో అంత్యం వివాదాస్పదమైన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది గన్నవరమే. ఇప్పటికే గన్నవరంలో వల్లభనేని వంశీ, దుట్టా..యార్లగడ్డకు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్న క్రమంలో గన్నవరం రాజకీయానికి మాజీ మంత్రి కొడాలి నాని మరికాస్త ఆజ్యం పోశారు.

AP Politics : YCPలో టికెట్ రగడ..కొడాలి వ్యాఖ్యలతో మరోసారి హీటెక్కిన గన్నవరం రాజకీయం..

Mla Kodali Sensational Comments On Vallbhaneni Vamsi

MLA kodali sensational comments on vallbhaneni vamsi  : అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతున్న అధికార వైసీపీ పార్టీలో గన్నవరం రాజకీయం ఎప్పటికప్పుడు హీట్ లోనే ఉంటుంది. ఏపీ పాలిటిక్స్ లో అంత్యం వివాదాస్పదమైన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది గన్నవరమే. ఇప్పటికే గన్నవరంలో వల్లభనేని వంశీ, దుట్టా రామచందర్రావు, యార్లగడ్డకు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. సీఎం జగన్, సజ్జలతో సహా పార్టీలోని పెద్దలంతా ఈ వివాదాన్ని క్లోజ్ చేయాలనుకున్నా ఏమాత్రం కుదరటంలేదు. సీఎం జగన్ కూడా వీరి పంచాయితీపై అసహనం వ్యక్తం చేసినా అది మాత్రం అంతకంతకు పెరుగుతునే ఉంది. అసలే వివాదాలుగా ఉన్న గన్నవరం రాజకీయానికి మాజీ మంత్రి కొడాలి నాని మరికాస్త ఆజ్యం పోశారు. దీంతో గన్నవరం రాజకీయం మరోసారి హీటెక్కింది.

Also read : CM Jagan : జగన్ వద్దకు గన్నవరం, బందరు పంచాయితీలు

దుట్టా, యార్లగడ్డ వర్గాలు వంశీని తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. వంశీ ఒక్కరే ఇద్దరితోనూ పొలిటికల్ ఫైట్ చేస్తున్నారు. దీంతో గన్నవరం రాజకీయం హీటెక్కింది. ఈ క్రమంలో గన్నవరం వైసీపీ ప్లీనరీ సమావేశానికి హాజరైన మంత్రి కొడాలి నాని.. సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో గన్నవరం వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఇందులో మరోమాట లేదన్నారయన.

అంతేకాదు కొంతమంది నేతలు పెనమలూరు టీడీపీ టికెట్ కోసం వెళ్తే.. గన్నవరం, గుడివాడకు వెళ్తారా అని అడగాల్సిన దుస్థితి నెలకొంది అని అన్నారు. రెండు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే దొరకని పరిస్థితి నెలకొందన్నారు. గన్నవరం, గుడివాడలో తమను ఓడించే నాయకులు టీడీపీకి లేరని కొడాలి నాని ఎద్దేవా చేశారు.

Also read : Gannavaram YCP Politics : ఎంతకూ తేలని ‘గన్నవరం’పంచాయతీ’.. జగన్‌కు ఎవరు కావాలి? వల్లభనేనా? దుట్టానా?

కొడాలి నాని వ్యాఖ్యలతో గన్నవరం వైసీపీలో కలకలం మొదలైంది. వంశీని వ్యతిరేకిస్తున్న దుట్టా, యార్లగడ్డ వర్గాల్లో కలవరం మొదలైంది. ఇటీవల ఒకేరోజు అటు వంశీ, అటు యార్లగడ్డ, దుట్టా ఘాటైన విమర్శలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారం ఏకంగా సీఎం దగ్గరకు చేరడంతో ఆయన కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. సీఎం జగన్.. వంశీకి అనుకూలంగానే ఉన్నా.. మిగిలిన రెండు వర్గాలు మాత్రం ముఖ్యమంత్రి మాటను లెక్కచేయడం లేదు. వంశీతో కలిసి నడవాలని అధిష్టానం సూచిస్తున్నా.. తమ వల్లకాదని తేల్చిచెప్తున్నారు. వైసీపీలోనే ఉంటామని.. అదే వంశీ వైసీపీ తరపున పోటీ చేస్తే ఆయన్ను ఓడిస్తామని ఛాలెంజ్ చేస్తున్నారు.