AP Politics : YCPలో లక్కీ భరత్..కుప్పంలో చంద్రబాబును ఢీకొట్టబోయేది అతనేనా?!

అదృష్టమంటే ఆయనదే. పాలిటిక్స్‌లోకి వచ్చి మూడేళ్లు కూడా కాలేదు. పదవులే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయ్. నాయకుడిని వెతుక్కుంటూ పదవులు కూడా వరుసగా వచ్చేశాయ్. రాజకీయాల్లోకి రావడంతోనే.. అధికారపార్టీకి నియోజకవర్గ ఇంచార్జ్ అయిపోయారు. తర్వాత నేరుగా ఎమ్మెల్సీ, ఇప్పుడు ఏకంగా జిల్లా పార్టీ ప్రెసిడెంట్.

AP Politics : YCPలో లక్కీ భరత్..కుప్పంలో చంద్రబాబును ఢీకొట్టబోయేది అతనేనా?!

Ycp Mlc Bharat Has Become A Hot Topic In Chittoor District (1)

AP Politics : అదృష్టమంటే ఆయనదే. పాలిటిక్స్‌లోకి వచ్చి మూడేళ్లు కూడా కాలేదు. పదవులే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయ్. నాయకుడిని వెతుక్కుంటూ పదవులు కూడా వరుసగా వచ్చేశాయ్. రాజకీయాల్లోకి రావడంతోనే.. అధికారపార్టీకి నియోజకవర్గ ఇంచార్జ్ అయిపోయారు. తర్వాత నేరుగా ఎమ్మెల్సీ, ఇప్పుడు ఏకంగా జిల్లా పార్టీ ప్రెసిడెంట్. ఇంత తక్కువ టైంలో.. ఈ స్థాయికి ఎదిగిన ఆ నాయకుడిపై.. జిల్లా అంతటా చర్చ నడుస్తోంది. ఓ పెద్దాయన ఆశీస్సులతోనే.. ఆ లీడర్ ఎదిగిపోతుండటం.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

పాలిటిక్స్‌లో సక్సెస్ కావాలంటే.. జీవితాలు ధారబోయాలి. దాని బదులు.. గుట్టలు గుట్టలుగా క్యాష్ అయినా సమర్పించుకోవాలి. ఒకటి జన బలమైనా ఉండాలి. నోటు బలమైనా ఉండాలి. ఒక్కోసారి రెండూ ఉన్నా.. రాజకీయాల్లో సక్సెస్ కాలేం. ఏళ్ల తరబడి ప్రజాసేవ, పార్టీ సేవ చేస్తే గానీ.. ఉన్నత స్థాయికి వెళ్లడం.. అంత ఈజీ కాదు. కానీ.. ఈ యంగ్ లీడర్ మాత్రం.. రాజకీయాల్లోకి వచ్చిన మూడేళ్లకే.. ఎక్కడికో వెళ్లిపోయారు. అతనే ఈ భరత్.

Also read : Ap Politics : కృష్ణా జిల్లా టీడీపీలో గ్రూప్ పాలిటిక్స్‌..నేతలకు చంద్రబాబు క్లాస్

ఎన్నో ఏళ్లుగా.. కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేస్తూ.. ఓడిపోతూ వస్తున్న చంద్రమౌళి తనయుడే ఈ భరత్. గత ఎన్నికల్లోనూ.. చంద్రమౌళి, బాబుపై పోటీ చేసి గౌరవప్రదమైన ఓట్లు సాధించారు. అయితే చంద్రమౌళి మరణంతో.. ఆయన తనయుడు భరత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కుప్పం వైసీపీ ఇంచార్జ్‌గా నియమితులయ్యారు. అక్కడ మొదలైన జర్నీ.. అస్సలు ఆగట్లేదు. అన్నింటికీ మించి.. జిల్లా పెద్ద.. మంత్రి పెద్ది రెడ్డి ఆశీస్సులు లభించడంతో.. బుల్లెట్‌లా దూసుకుపోతున్నారనే చర్చ జరుగుతోంది.

కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో.. వైసీపీకి ఘన విజయం దక్కడంతో.. భరత్ సీఎం జగన్ దృష్టిలోనూ పడ్డారు. ఊహించని లక్ వచ్చి.. ఇంటి కాలింగ్ బెల్ నొక్కింది. పార్టీ తరఫున.. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం వచ్చింది. అప్పుడే.. భరత్ పేరు మార్మోగిపోయింది. జిల్లాలో ఉన్న ఎంతో మంది సీనియర్లను కాదని.. ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకున్నారు భరత్. గత ఎన్నికల్లో.. టికెట్ దక్కని ముఖ్య నేతలంతా.. ఎమ్మెల్సీ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. కానీ.. వాళ్లందరినీ పక్కనబెట్టి.. మంత్రి పెద్దిరెడ్డి.. భరత్‌కు అవకాశం ఇప్పించారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.

Also read : Telangana : బండి పాదయాత్రలో బిగ్ ట్విస్ట్..పాలమూరులో బీజేపీకి దిమ్మతిరిగే షాకిస్తున్న టీఆర్ఎస్

కుప్పం ఇంచార్జ్‌గా.. తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికైన భరత్‌కు.. లడ్డూ కావాలా నాయనా.. అన్నట్లుగా మరో సూపర్ చాన్స్ వచ్చింది. ఈసారి ఏకంగా.. చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడైపోయారు. ఇది మాత్రం.. ఎవరూ ఊహించని పరిణామం. నిజానికి.. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పెద్దిరెడ్డి, నారాయణస్వామి, రోజా. వీరు కాక.. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీళ్లందరినీ పక్కనబెట్టి.. వైసీపీ అధిష్టానం భరత్‌ను ఎంపిక చేయడం అంత చిన్న విషయమేమీ కాదు.

అయితే.. భరత్‌కు వరుస పదవులు దక్కడం వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. కుప్పం ఇంచార్జిగా చంద్రమౌళి ఉన్నప్పటి నుంచి ఆయనతో పెద్దిరెడ్డికి సత్సంబంధాలున్నాయ్. పెద్దిరెడ్డి చొరవతోనే.. చంద్రమౌళి తనయుడు భరత్.. పదవులు దక్కించుకున్నారనే టాక్ ఉంది. ఈ విషయంలో.. జిల్లాలోని కొందరు నేతలు గుర్రుగా ఉన్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయ్. వచ్చే ఎన్నికల్లో.. చంద్రబాబును.. కుప్పంలో ఎదుర్కోబోయేది కూడా భరతేనన్న చర్చ జరుగుతోంది. చిత్తూరు రాజకీయాల్లో.. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.