AP Power Holiday : పరిశ్రమలకు ప్రభుత్వం షాక్.. నేటినుంచే ఏపీలో పవర్ హాలిడే..!

AP Power Holiday : ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. మండుతున్న ఎండలకు జనం ఉక్కపోతతో అవస్థలు పడిపోతున్నారు. మరోవైపు ఏపీలో మొదలైన విద్యుత్ కోత‌లు అదే జనాన్ని ఉక్కిరిబిక్కిరిచేస్తున్నాయి.

AP Power Holiday : పరిశ్రమలకు ప్రభుత్వం షాక్.. నేటినుంచే ఏపీలో పవర్ హాలిడే..!

Ap Power Holiday Restricted Power Supply To Industries From April 8 To 22 Today

AP Power Holiday : ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. మండుతున్న ఎండలకు జనం ఉక్కపోతతో అవస్థలు పడిపోతున్నారు. మరోవైపు ఏపీలో మొదలైన విద్యుత్ కోత‌లు అదే జనాన్ని ఉక్కిరిబిక్కిరిచేస్తున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం పరిశ్రమలకు కూడా పవర్ హాలిడే ప్రకటించింది. ప‌రిశ్రమ‌ల‌కు ప‌వ‌ర్ హాలిడేలు ప్రక‌టిస్తూ ఏపీ సెంట్రల్ ప‌వ‌ర్ డిస్ట్రిబ్యూష‌న్ కార్పొరేష‌న్ లిమిటెడ్ ఆదేశాలు జారీ చేసింది. APSPDCL ఆదేశాలతో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల పరిధిలో పరిశ్రమలకు షాక్‌ తగిలింది.

పరిశ్రమలు వారాంతపు సెలవుకు అదనంగా మరోరోజు సెలవు ప్రకటించుకోవాలని.. నిరంతరాయంగా పనిచేసే పరిశ్రమలు కూడా తమ అవసరాల్లో 50 శాతం విద్యుత్ మాత్రమే వినియోగించుకోవాలని ఆదేశించింది. ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఆదేశాల ప్ర‌కారం.. 253 ప్రాసెసింగ్ ప‌రిశ్ర‌మ‌లు 50 శాతం విద్యుత్‌నే వాడాల్సి ఉంటుంది. 1,696 ప‌రిశ్ర‌మ‌ల‌కు వారంలో ఒక‌రోజు ప‌వ‌ర్ హాలిడేను అమ‌లు చేయాలి. వారాంత‌పు సెల‌వుకు అద‌నంగా ఒక రోజు ప‌వ‌ర్ హాలిడేను కొన‌సాగించాలి. ఈ నెల 8 నుంచి 22 వ‌ర‌కు రెండు వారాల పాటు అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌కు ప‌వ‌ర్ హాలిడేను ప్ర‌క‌టిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

రాష్ట్రంలో బొగ్గు కొరతతో ఇబ్బందులు తప్పడం లేదన్న అధికారులు.. 14వేల మెగావాట్లకు గాను 2వేల మెగావాట్లే అందుబాటులో ఉందన్నారు. APSPDCL సీఎండీ ఆదేశాల ప్రకారం.. 253 ప్రాసెసింగ్ ప‌రిశ్రమ‌లు 50 శాతం విద్యుత్‌నే వాడాల్సి ఉంటుంది. వెయ్యి 696 ప‌రిశ్రమ‌లు వారాంత‌పు సెల‌వుకు అద‌నంగా ఒక రోజు ప‌వ‌ర్ హాలిడేను కొన‌సాగించాలి. నేటి నుంచి ఈ నెల 22 వ‌ర‌కు రెండు వారాల పాటు అన్ని ప‌రిశ్రమ‌ల‌కు ప‌వ‌ర్ హాలిడేను ప్రక‌టిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Read Also :  AP Power Holiday : ఏపీలో పరిశ్రమలకు షాక్.. రేపటి నుంచి పవర్ హాలిడే