అందాల కోడిపుంజు..ధర వింటే షాక్ అవ్వాల్సిందే..!!

  • Published By: nagamani ,Published On : October 29, 2020 / 02:35 PM IST
అందాల కోడిపుంజు..ధర వింటే షాక్ అవ్వాల్సిందే..!!

AP : అందాల కోడిపుంజు. చూడచక్కని రూపం. తెల్లటి ఈకలతో శ్వేత మయూరాన్ని తలపించే చూడచక్కని కోడిపుంజు. ఆరడగుల అందగాడిలా 28 అంగుళాల పొడుగుతో బలిష్టమైన కాళ్లతో డేగలాంటి చురుకైన కళ్లతో చిలుకలాంటిముక్కుతో చూసినవాళ్లని తన అందంతో పొగరుతో కట్టిపడేస్తుందా కోడిపుంజు. కోడిపెట్టలు చూపు తిప్పుకోలేని ఆ కోడిపుంజు బరువు 7 కిలోలు. అంటే ఆశ్చర్యపోవాల్సిందే. అది ఎంత ఆరోగ్యంగా బలిష్టంగా ఉంటుందో ఊహించుకోవాల్సిందే. ఆ అందాల కోడిపుంజు ధర వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే. పెద్దపర్ల జాతికి చెందిన ఈ కోడి పుంజు అక్షరాలా ‘‘లక్ష’’ రూపాయలంటే షాక్ అవ్వకేం చేస్తారు చెప్పండి..!!


ఏపీలోని ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన మందగంటి పెద్ద పుల్లయ్య అనే రదైతు గత 30 ఏళ్లనుంచి కోళ్ల పెంపకంలో ఆరితేరాడు. కోడిని చూస్తే చాలు అది ఏజాతి కోడి..ఎంత బరువు ఉంటుంది? అని ఠక్కున చెప్పేస్తాడు.కోళ్లపెంపకం ప్రారంభించిక ముందు పుల్లయ్య తాపీమేస్త్రీగా పనిచేసేవాడు. కానీ తన ఇంటిలో మాత్రం రకరకాల కోళ్లను పెంచేవాడు. ఆ కోళ్లకు చక్కటి మేత వేసి చక్కటి ఆరోగ్యంగా ఉండేలా చూసుకునేవాడు.


కోళ్ల పెంపకం అంటే ఇష్టం ఉన్న పుల్లయ్య నాలుగేళ్ల క్రితం తాపీమేస్త్రీ పని మానేశాడు. తన గ్రామంలోనే 2 ఎకరాల పొలం కొనుక్కుని వ్యవసాయం చేస్తున్నాడు. రైతు అంటే కోడి, దూడ ఉండాల్సిందే కదా..అసలేకోళ్ల పెంపకం అంటే ఇష్టమున్న పుల్లయ్య అరుదైన జాతి కోళ్ల కోసం ఎన్నో ఊర్లు తిరిగాడు. ఊర్లు..జిల్లాలే కాదు ఏకంగా రాష్ట్రాలు కూడా తిరిగాడు. అంటే కోళ్లు అంటే పుల్లయ్యకు ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.



అలా అరుదైన జాతి కోళ్ల కోసం తిరేగే పుల్లయ్య మూడు నెలల క్రితం తమిళనాడులోని పొల్లాచ్చిలో పెద్దపర్ల జాతికి చెందిన ఏడు నెలల వయసు గల కోడిపుంజుని చూశాడు. అక్షరాలా రూ.లక్షలకు కొనేశాడు. అరుదైన జాతి కోళ్లను కొనటానికి తిరగటానికి పుల్లయ్య రూ.24 వేలు ఖర్చు పెట్టాడు.


అలా తన కల ఫలించి మొత్తం మీద తమిళనాడు నుంచి కోడి పుంజును ఇంటికి తీసుకొచ్చేందుకు రూ.1.24 లక్షలు ఖర్చు పెట్టాడు. గిద్దలూరు, కొమరోలు, రాచర్ల, పోరుమామిళ్ల, మైదుకూరు ప్రాంతాల్లో ఇటువంటి అరుదైన జాతి పుంజు లేదని..కేవలం నా దగ్గర మాత్రమే ఉందని పుల్లయ్య గర్వంగా తల ఎగరేస్తు చెబుతున్నాడు. అంతేకాదు తాను పెంచే కోళ్లలో రూ.30 వేలకు తక్కువ ధరలో లేదని మరీ మరీ చెబుతున్నాడు పుల్లయ్య.