AP PRC Issue : ఉద్యోగ సంఘాలు వర్సెస్ ఉపాధ్యాయ సంఘాలు..

ఉపాధ్యాయ సంఘాలపై ఉద్యోగ సంఘాల ఫైర్ అయ్యాయి. రాత్రి జరిగిన చర్చల్లో ఓకే అని ఇప్పుడు వ్యతిరేకించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.

AP PRC Issue : ఉద్యోగ సంఘాలు వర్సెస్ ఉపాధ్యాయ సంఘాలు..

Ap Prc Sucess

Andhrapradesh Employees Unions : ఏపీ పీఆర్సీపై వెనక్కి తగ్గారు ఏపీ ఉద్యోగులు. వాళ్లు తగ్గడమే ఆలస్యం.. ఉపాధ్యాయులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. సీపీఎస్ రద్దు, ఫిట్‌మెంట్‌పై తేలకుండానే ఎలా వెనక్కి తగ్గుతారంటూ ప్రశ్నిస్తున్నారు. ఆందోళన కంటిన్యూ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఏపీలో ఉద్యోగ సంఘాలు వర్సెస్ ఉపాధ్యాయ సంఘాల మధ్య రగడ రాజుకుంది. చర్చల పట్ల ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. చర్చల్లో సీపీఎస్‌ రద్దుపై నిర్ణయం జరగలేదంటున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. ఫిట్‌మెంట్‌ని 27 శాతానికి పెంచుకోలేకపోయామని… దీంతో తమతో కలిసొచ్చే సంఘాలతో ఆందోళన కొనసాగిస్తామని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Read More : Hyundai Cars India: దెబ్బకు దిగొచ్చిన హ్యుండయ్, క్షమాపణలు చెబుతూ ట్వీట్

చర్చల్లో మంత్రుల కమిటీ కొన్నింటిపై సానుకూలంగా స్పందించినప్పటికి పీఆర్సీపై పునరాలోచన లేదని చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్టీరింగ్ కమిటీలో సభ్యులయిన ఏపీటీఎఫ్ చెబుతోంది. ప్రభుత్వం టీచర్లుకు 10 శాతమే హెచ్ఆర్ఏ ఇస్తామంటోందని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. హెచ్ఆర్ఏ శ్లాబులు పునరుద్దించుకోలేక పోయామని.. ఆ విషయంలో గ్రామీణ ప్రాంత ఉద్యోగులకు తీరని అన్యాయం జరిగిందంటున్నారు.

Read More : Yadadri : యాదాద్రికి సీఎం కేసీఆర్.. మార్చి 28న లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ పునఃప్రారంభం

అయితే ఉపాధ్యాయ సంఘాలపై ఉద్యోగ సంఘాల ఫైర్ అయ్యాయి. రాత్రి జరిగిన చర్చల్లో ఓకే అని ఇప్పుడు వ్యతిరేకించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ఉపాధ్యాయుల పాత్ర ఒక్కటే ఉద్యమంలో ఉందనే ప్రచారం జరుగుతోందని, రాజు గారి బిందెలో అందరూ పాలుపోసినట్టుగా ఉందన్నారు. ఏదో హీరోయిజం కోసం ఆందోళన చేస్తే ఎలా అని ప్రశ్నించారు. మరోవైపు.. ఉపాధ్యాయుల ఆందోళనపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. టీచర్‌ సంఘాలు చర్చల్లో అంగీకరించి… బయటికి వెళ్లి మళ్లీ ఆందోళన చేయడం సరికాదన్నారు. మొత్తంగా ఉద్యోగులు వెనక్కి తగ్గినా.. ఉపాధ్యాయులు ఆందోళన కంటిన్యూ చేస్తామని చెప్పడంతో.. నెక్స్ట్ ఏంటి.. ఏం జరుగుతుందా అనే చర్చ జోరందుకుంది.