CM Jagan EODB : ఈవోడీబీ ర్యాంకింగ్స్‌లో అగ్రగామిగా ఏపీ.. అధికారులపై సీఎం జగన్ ప్రశంసల వర్షం

సులభతర వాణిజ్య రాష్ట్రాల ర్యాంకింగ్స్(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ -ఈవోడీబీ)లో ఆంధ్రప్రదేశ్ ని మొదటి స్థానంలో నిలిపిన పరిశ్రమల శాఖ ఉన్నతాధికారుల కృషిని ముఖ్యమంత్రి జగన్ అభినందించారు.

CM Jagan EODB : ఈవోడీబీ ర్యాంకింగ్స్‌లో అగ్రగామిగా ఏపీ.. అధికారులపై సీఎం జగన్ ప్రశంసల వర్షం

Cm Jagan (1)

CM Jagan EODB : సులభతర వాణిజ్య రాష్ట్రాల ర్యాంకింగ్స్ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ -ఈవోడీబీ)లో ఆంధ్రప్రదేశ్ ని మొదటి స్థానంలో నిలిపిన పరిశ్రమల శాఖ ఉన్నతాధికారుల కృషిని ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. ఈ విషయాన్ని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ వెల్లడించారు. పూర్తి స్థాయి సర్వే ఆధారంగా 97.89 శాతంతో వరుసగా రెండో ఏడాది, 2020 ఈవోడీబీ ర్యాంకుల్లో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలపడం పట్ల సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Andhra Pradesh: మరోసారి సత్తాచాటిన ఆంధ్రప్రదేశ్.. ఆ విషయంలో దేశంలోనే నెంబర్ వన్..

15 రంగాల్లో 301 సంస్కరణల ప్రయోజనాలు పొందిన వ్యాపారవేత్తల నుంచి తీసుకున్న అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన ర్యాంకుల్లో మొదటి స్థానం దక్కడం మరింత ప్రత్యేకమని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడ్డారన్నారు. ఇదే కృషిని కొనసాగించి పారిశ్రామికంగా మరింత రాణించి ఏపీని అన్ని రంగాల్లో అగ్రగామిని చేసే దిశగా అడుగులు వేయాలంటూ ముఖ్యమంత్రి ప్రశంసించడం ప్రోత్సాహంతో పాటు బాధ్యతతో కూడిన స్ఫూర్తిని నింపాయని కరికాల వలవన్ అన్నారు.

పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఈడీబీ సీఈవో, ఏపీఐఐసీ వీసీ, ఎండీ సుబ్రమణ్యం జవ్వాది, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, పరిశ్రమల శాఖలో వస్త్ర విభాగం చేనేత ముఖ్యకార్యదర్శి సునీత తదితర ఉన్నతాధికారుల బృందం మంగళవారం సాయంత్రం సీఎం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి సత్తా చాటింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బిజినెస్ రీఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ -2020లో టాప్ అచీవర్స్ లో ఏడు రాష్ట్రాలను ప్రకటించారు. ఈ లిస్టులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. టాప్ అచీవర్స్ లో ఏపీతో పాటు గుజరాత్, హర్యానా, కర్నాటక, పంజాబ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఒక దేశం లేదా ఒక ప్రాంతంలో కొత్తగా ఒక వ్యాపారం స్థాపించేందుకు ఉన్న అనుకూల వాతావరణం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సూత్రానికి విశేష స్పందన రావడంతో మన దేశం కూడా దీనిపై దృష్టి సారించింది. అదే సమయంలో దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఈ అంశంలో పోటీ నిర్వహించి ర్యాంకింగ్ ఇస్తూ వస్తోంది. దీంతో అటు రాష్ట్రాల్లోనూ ఈ అంశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు తొలి నుంచి ముందు వరుసలో ఉంటున్నాయి.

దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా రాష్ట్రాల మధ్య పోటీ వాతావరణాన్ని పెంచే లక్ష్యంతో సరళతర వ్యాపార నిర్వహణ ర్యాంకులను వాణిజ్య మంత్రిత్వశాఖలోని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (DPIIT) ఏటా ఈ ర్యాంకులను ప్రకటిస్తోంది. వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక (BRAP) అమలు ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకులను కేటాయిస్తుంది. ఇందులో భాగంగా లైసెన్సింగ్‌ విధానం, అనుమతులు, ప్రభుత్వ సహకారం, కార్మికులు, పర్యావరణం వంటి 15 విభాగాల్లో మొత్తం 301 సంస్కరణలతో కూడిన లక్ష్యాలను నిర్దేశించింది. ఈ పద్ధతిని 2014లో మొదలుపెట్టగా ఇప్పటి వరకు 2015, 2016, 2017-18, 2019లో ర్యాంకులు ప్రకటించారు. తాజాగా 2020 సంవత్సరానికి గాను డీపీఐఐటీ తాజా నివేదిక విడుదల చేసింది.