AP Covid -19 : ఏపీలో 22 వేలు దాటిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 22,610 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 15,21,142కి చేరింది.

AP Covid -19 : ఏపీలో 22 వేలు దాటిన కరోనా కేసులు

Ap Covid Cases Update

AP Covid -19  : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 22,610 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 15,21,142కి చేరింది.

బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 1,01,281 శాంపిల్స్ ను పరీక్షించారు. దీంతో ఇప్పటి వరకు శాంపిల్స్ పరీక్షించిన వారి సంఖ్య 1,83,42, 918 కి చేరింది. కాగా… రాష్ట్రంలో ప్రస్తుతం 2,09,134 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కోంది.

రాష్ట్రంలో కరోనా వైరస్ తో బాధ పడుతూ 114 మంది మరణించగా…. 23,098 బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయి వెళ్లారు. దీంతో కోవిడ్ నుంచి కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్లిన వారి సంఖ్య 13,02, 208 కి చేరింది. కరోనా వైరస్ కారణంగా నిన్న అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 17 మంది మరణించగా… వైఎస్సార్ కడప జిల్లాలో ఇద్దరు మరణించారు.

జిల్లాల వారీగా చూస్తే చిత్తూరు జిల్లాలో 15, తూర్పు గోదావరి, గుంటూరు, విశాఖ జిల్లాలో 10 మంది చొప్పున అనంతపురం, విజయనగరం జిల్లాల్లో 9 మంది చొప్పున, కృష్ణలో 8 మంది, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఏడుగురు చొప్పున, నెల్లూరు, శ్రీకాకుళంలలో ఐదుగురు చొప్పున కరోనా వైరస్ సోకి మరణించారు.