AP Corona : ఏపీలో మరింత తగ్గిన కరోనా వ్యాప్తి

ఏపీలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. రోజువారీ కేసులు, మరణాల్లో తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో 18వేల 788 కరోనా పరీక్షలు నిర్వహించగా..

AP Corona : ఏపీలో మరింత తగ్గిన కరోనా వ్యాప్తి

Ap Corona Cases

AP Corona : ఏపీలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. రోజువారీ కేసుల్లో తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో 18వేల 788 కరోనా పరీక్షలు నిర్వహించగా, 122 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 31 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 18, గుంటూరు జిల్లాలో 18 కేసులు వెలుగుచూశాయి. ప్రకాశం జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

Liver : లివర్ ఆరోగ్యంగా ఉండేందుకు చిట్కాలు

కరోనా మరణాలు గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఒక మరణం సంభవించింది. కృష్ణా జిల్లాలో ఒకరు కోవిడ్ తో చనిపోయారు. అదే సమయంలో 213 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,73,852 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20,57,369 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 2,030 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,453కి పెరిగింది.

Body Ageing: ఇవి తింటున్నారా.. ముసలితనం ముందే రావడం ఖాయం

కరోనా కొత్త కేసులు, మరణాలు గణనీయంగా తగ్గడం ఊరటనిచ్చే అంశం. అయితే, ఇంకా ముప్పు పూర్తిగా తొలగలేదని, జాగ్రత్తగా ఉండాల్సిందే అని అధికారులు తేల్చి చెప్పారు. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

రెండేళ్ల నుంచి కంటి మీద కునుకు లేకుండా చేసిన కరోనావైరస్ మహమ్మారి.. కాస్త తగ్గుముఖం పట్టింది అనుకునేలోపు ఒమిక్రాన్ రూపంలో మళ్లీ విజృంభించడం స్టార్ట్ చేసింది. క్రమంగా అన్ని దేశాలకు వ్యాపిస్తోంది. ఈ వేరియంట్‌ సోకిన దేశాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఈ వేరియంట్‌ 46 దేశాలకు పాకింది. ఇప్పుడిప్పుడే డెల్టా వేరియంట్‌ నుంచి కోలుకుంటన్న తరుణంలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందడం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 941కి పెరిగింది.

యూకేలో 246 ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాగా, దక్షిణాఫ్రికాలో 228, జింబాబ్వేలో 50, అమెరికాలో 39 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కూడా ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 21కి చేరింది. నిన్న ఒక్కరోజే 17 కేసులు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఒమిక్రాన్‌పై మరింత దృష్టి సారించాలని వైద్యారోగ్య శాఖకు సూచనలు చేసింది.