AP Corona Cases : ఏపీలో లక్ష దాటిన కరోనా యాక్టివ్ కేసులు, పెరిగిన మరణాలు

రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు లక్ష దాటడం, కోవిడ్ మృతుల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది.

AP Corona Cases : ఏపీలో లక్ష దాటిన కరోనా యాక్టివ్ కేసులు, పెరిగిన మరణాలు

Ap Corona Cases

AP Corona Cases : ఏపీలో కరోనావైరస్ మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 13వేల 819 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 12మంది కోవిడ్ తో చనిపోయారు. చిత్తూరు, తూర్పు గోదావరి, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు చొప్పున కరోనాతో మరణించారు. ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో చనిపోయారు. మరోవైపు నిన్న ఒక్కరోజే 5వేల 716 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కాగా, రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు లక్ష దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,01,396 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Night Food : రాత్రి సమయంలో ఆ ఆహారం తింటే షుగర్ , గుండె జబ్బులు వచ్చే చాన్స్!..

తాజాగా నమోదైన వాటిలో విశాఖలో అత్యధికంగా 1988 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో 1589, గుంటూరు జిల్లాలో 1422, అనంతపురం జిల్లాలో 1345 కేసులు, నెల్లూరు జిల్లాలో 1305 కేసులు వెలుగుచూశాయి. కాగా, రాష్ట్రంలో నిన్న 14వేల 502 కేసులు నమోదవగా.. ఇవాళ ఆ సంఖ్య కాస్త తగ్గింది.

Sanitizers : శానిటైజర్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు.. ముఖ్యంగా మహిళలు, పిల్లలు..

రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,08,955 కి చేరింది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20,92,998గా ఉంది. గడిచిన 24 గంటల్లో 46వేల 929 కరోనా టెస్టులు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,22,34,226 కోవిడ్ టెస్టులు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.