AP Corona : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

ఏపీలో క‌రోనా తీవ్రత తగ్గుతోంది. పాజిటివ్ కేసులు, మరణాలు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే నిన్న తగ్గిన కరోనా కేసులు… ఇవాళ

AP Corona : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

Ap Corona

AP Corona : ఏపీలో క‌రోనా తీవ్రత తగ్గుతోంది. పాజిటివ్ కేసులు, మరణాలు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే నిన్న తగ్గిన కరోనా కేసులు(2,567)… ఇవాళ స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులినెటిన్ ప్రకారం.. గ‌త 24 గంట‌ల్లో 90వేల 204 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు చేయగా కొత్తగా 2వేల 591 పాజిటివ్‌ కేసులు న‌మోదయ్యాయి. మరో 15 మంది కరోనాకు బలయ్యారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 511 కేసులు, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 29 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో 3వేల 329 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,29,579కి పెరగగా… ఇప్పటి వరకు 18,90,565 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 13,057 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25వేల 957 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు:
అనంతపురం జిల్లాలో 69, చిత్తూరు జిల్లాలో 349, తూర్పుగోదావరి జిల్లాలో 511, గుంటూరు జిల్లాలో 219, కడప జిల్లాలో 217, కృష్ణాజిల్లాలో 190, కర్నూలు జిల్లాలో 29, నెల్లూరు జిల్లాలో 162, ప్రకాశం జిల్లాలో 251, శ్రీకాకుళం జిల్లాలో 62, విశాఖపట్నం జిల్లాలో 220, విజయనగరం జిల్లాలో 46, పశ్చిమగోదావరి జిల్లాలో 266 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.