AP Corona Cases : ఏపీకి బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన కరోనా కేసులు.. ఆ రెండు జిల్లాల్లో జీరో కోవిడ్

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. గత వారం దాదాపు 500లకు దగ్గరగా కొత్త కేసులు నమోదవగా.. సోమవారం కేసుల సంఖ్య 300 దిగువకి పడిపో

AP Corona Cases : ఏపీకి బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన కరోనా కేసులు.. ఆ రెండు జిల్లాల్లో జీరో కోవిడ్

Ap Corona Cases

AP Corona Cases : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. గత వారం దాదాపు 500లకు దగ్గరగా కొత్త కేసులు నమోదవగా.. సోమవారం కేసుల సంఖ్య 300 దిగువకి పడిపోయింది. ఒక్కరోజులోనే కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 27,641 పరీక్షలు చేయగా, 295 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

Mohammed Shami : పాకిస్తాన్ వెళ్లిపో, దేశద్రోహి, ఎంత డబ్బు తీసుకున్నావ్… భారత క్రికెటర్‌పై పచ్చి బూతులు

మరో ఏడుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,350కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 560 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీల సంఖ్య 20,44,692కి చేరింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 4వేల 830 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,63, 872 కి పెరిగింది.

Hair Dye : జుట్టుకు హెయిర్ డై వాడుతున్నారా!..తప్పక తెలుసుకోవాల్సిందే…

జిల్లాల వారిగా కరోనా కేసులు..
చిత్తూరు జిల్లాలో 40 కేసులు, తూర్పు గోదావరిలో 69, గుంటూరు 31, కడప 13, కృష్ణా 68, కర్నూలు 1, నెల్లూరు 16, ప్రకాశం 19, శ్రీకాకుళం 13, విశాఖపట్నం 22, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 కేసులు నమోదవగా.. విజయనగరం, అనంతపురం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఊరటనిచ్చే అంశం. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ముందున్న ఏపీలో ఆదివారం నాటికి మొత్తంగా 5కోట్ల మందికి టీకాలు అందాయి.