AP Corona : ఏపీలో తగ్గిన కరోనా కేసులు, భయపెడుతున్న మరణాలు

ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. కానీ మరణాలు మాత్రం ఆగడం లేదు. మరోసారి రాష్ట్రంలో వందకు పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91వేల 629 నమూనాలను పరీక్షించగా.. 18వేల 767 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో కలిసి ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 15,80,827కి చేరింది. ఇక ఒక్కరోజు వ్యవధిలో 104 మంది కరోనాకు బలవ్వగా.. ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10వేల 126కి పెరిగింది.

AP Corona : ఏపీలో తగ్గిన కరోనా కేసులు, భయపెడుతున్న మరణాలు

Ap Corona

AP Corona Cases : ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. కానీ మరణాలు మాత్రం ఆగడం లేదు. మరోసారి రాష్ట్రంలో వందకు పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91వేల 629 నమూనాలను పరీక్షించగా.. 18వేల 767 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో కలిసి ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 15,80,827కి చేరింది. ఇక ఒక్కరోజు వ్యవధిలో 104 మంది కరోనాకు బలవ్వగా.. ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10వేల 126కి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం(మే 23,2021) బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,09,237 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా 20వేల 109 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

మహమ్మారి కారణంగా అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 15 మంది ప్రాణాలు కోల్పోగా.. పశ్చిమగోదావరిలో 13 మంది, విజయనగరంలో 11 మంది, విశాఖపట్నంలో 9 మంది.. అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణ, కర్నూలు జిల్లాల్లో 8మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, నెల్లూరులో ఆరుగురు, కడప జిల్లాలో ముగ్గురు చొప్పున మృతి చెందారు. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2వేల 887 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో 2323 కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1972 కేసులు, అనంతపురం జిల్లాలో 1846 కేసులు వెలుగుచూశాయి.