AP Corona List : ఏపీలో ఒకే ఒక్క కరోనా కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 3వేల 464 కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకే ఒక్క పాజిటివ్ కేసు నమోదైంది.

AP Corona List : ఏపీలో ఒకే ఒక్క కరోనా కేసు నమోదు

Ap Corona

AP Corona List : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 3వేల 464 కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకే ఒక్క పాజిటివ్ కేసు నమోదైంది. ఆ ఒక్క కేసు నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 9 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కరోనా మరణాలేవీ సంభవించ లేదు. నేటి వరకు రాష్ట్రంలో 23,19,617 పాజిటివ్ కేసులు నమోదవగా.. 23,04,854 మంది కోలుకున్నారు.

నేటి వరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,730. రాష్ట్రంలో ఇంకా 33 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 3,34,85,936 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు 3వేల 509 కరోనా పరీక్షలు నిర్వహించగా.. రెండు పాజిటివ్ కేసులు వచ్చాయి.(AP Corona List)

అటు దేశంలోనూ కరోనా వైరస్ అదుపులోనే ఉంది. కొంతకాలంగా వెయ్యికి సమీపంలోనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 4.29 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,088 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. క్రితంరోజు కంటే 300 మేర అదనంగా కేసులొచ్చాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.25 శాతంగా ఉంది.

Covid-19 compensation: కొవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారం..60 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చు : సుప్రీంకోర్టు

మరో 1,081 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. నిన్న కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండటం గమనార్హం. 24 గంటల వ్యవధిలో మరో 26 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 10,870 (0.03 శాతం)గా ఉంది. రికవరీ రేటు 98.76 శాతంగా కొనసాగుతోంది. ఇక నిన్న 15 లక్షల మందికి పైగా టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ 186 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.(AP Corona List)

ఇది ఇలా ఉంటే.. దేశంలో కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మళ్లీ ఎప్పుడు పుంజుకుంటుందో తెలియదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. కరోనా నియంత్రణ నిమిత్తం శరవేగంగా వ్యాక్సిన్లు పంపిణీ చేస్తున్నా.. కొత్త వేరియంట్ల రూపంలో మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో కరోనా ఫోర్త్ వేవ్ హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందనే విషయంపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGEI) చీఫ్ డాక్టర్ ఎన్ కే అరోరా మాట్లాడారు. దేశంలో ఒకటి రెండు చోట్ల బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్.. తీవ్రమైన సంక్రమణకు దారితీయనందున ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని ఆయన అన్నారు.

Corona 4th Wave: దేశంలో కరోనా నాలుగో దశ రానుందా?: నిపుణులు ఏమంటున్నారంటే

ఇతర దేశాల నుంచి వస్తే తప్ప, మన దేశంలో XE వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం లేదన్న అరోరా.. అలాంటి పరిస్థితి వస్తే భారత్ లో జూన్-జులై మధ్య కరోనా నాలుగో దశ ఉంటుందని అంచనా వేశారు. మరోవైపు ఇప్పటి వరకు వెలుగు చూసిన అన్ని వేరియంట్లలో Covid -19 XE వేరియంట్ ఆసియాలో తీవ్ర వ్యాప్తిలో ఉందని.. నిత్యం 14 లక్షలకు పైగా కొత్త కరోనా కేసులు ఆసియా దేశాల్లో నమోదు అవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. చైనాలో ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ తీవ్ర వ్యాప్తిలో ఉండగా.. మహమ్మారి కట్టడికి చైనాలో కఠిన లాక్ డౌన్ విధించారని WHO తెలిపింది.