AP Corona Cases : ఏపీలో కాస్త తగ్గిన కరోనా కేసులు.. 24గంటల్లో 19వేలకు చేరువలో కేసులు, 71 మరణాలు

ఏపీలో కరోనా ప్రళయం కొనసాగుతోంది. కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. మరోసారి రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,15,275 శాంపిల్స్ పరీక్షించగా, 18వేల 972 మంది కరోనా నిర్ధారణ అయ్యింది. మరో 71మంది

AP Corona Cases : ఏపీలో కాస్త తగ్గిన కరోనా కేసులు.. 24గంటల్లో 19వేలకు చేరువలో కేసులు, 71 మరణాలు

Ap Reports Record Corona Cases

AP Corona Cases : ఏపీలో గత రెండు రోజులతో పోలిస్తే కరోనా వైరస్‌ తీవ్రత కాస్త తగ్గినట్టే కనబడుతోంది. క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు కాస్త తగ్గడం ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,15,275 శాంపిల్స్ పరీక్షించగా, 18వేల 972 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. మరో 71మంది కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో తాజాగా నమోదైన కేసుల్లో కర్నూలు జిల్లా(2628) టాప్ లో ఉంది. ఆ తర్వాత 1960 కేసులతో విశాఖ రెండో స్థానంలో ఉంది. అత్యల్పంగా కృష్ణాలో 969 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 11,63,994కి చేరింది. మరణాల సంఖ్య 8207కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,51,852 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 10వేల 227మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,003,935. క్రితం రోజుతో పోలిస్తే రోజువారీ కేసుల సంఖ్య కాస్త తగ్గడం ఊరట కలిగించే అంశం. క్రితం రోజు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 23వేల 920 కేసులు, 83 మరణాలు నమోదైన సంగతి తెలిసిందే.

కోవిడ్ తో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 9మంది, విశాఖలో 9మంది, విజయనగరంలో 9మంది చొప్పున మరణించారు. అనంతపురం జిల్లాలో ఏడుగురు, కర్నూలులో ఏడుగురు చొప్పున మరణించారు. కృష్ణాలో ఆరుగురు, ప్రకాశంలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు చొప్పున చనిపోయారు. చిత్తూరు జిల్లాలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు కరోనాకు బలయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం(మే 3,2021) బులెటిన్ విడుదల చేసింది.