AP Corona : ఏపీలో కరోనా ఉగ్రరూపం.. భారీగా పెరిగిన కేసులు, మరణాలు.. 11 జిల్లాల్లో వెయ్యి దాటిన బాధితుల సంఖ్య

ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. మరోసారి భారీ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. కొత్తగా మరో 20 వేలకు పైగా కేసులు, 80కి పైగా మరణాలు వెలుగుచూశాయి.

AP Corona : ఏపీలో కరోనా ఉగ్రరూపం.. భారీగా పెరిగిన కేసులు, మరణాలు.. 11 జిల్లాల్లో వెయ్యి దాటిన బాధితుల సంఖ్య

Ap Corona

AP Corona : ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. మరోసారి భారీ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. కొత్తగా మరో 20 వేలకు పైగా కేసులు, 80కి పైగా మరణాలు వెలుగుచూశాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 1,15,784 శాంపిల్స్‌ పరీక్షించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 20వేల 034 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

అలాగే, మరో 82మంది కరోనాతో చనిపోయారు. పాజిటివిటీ రేటు 17.3శాతంగా ఉంది. కాగా, వైరస్‌ బారిన పడి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం కాస్త ఊరటనిచ్చే అంశం. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం(మే 4,2021) కరోనా బులెటిన్ విడుదల చేసింది.

రాష్ట్రంలో 13 జిల్లాలు ఉంటే.. 11 జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదవడం భయాందోళనకు గురి చేస్తోంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 2398 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో 2318 కేసులు, అనంతపురం జిల్లాలో 2168 కేసులు, గుంటూరు జిల్లాలో 1678 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కడప జిల్లాలో 793 కేసులు వెలుగుచూశాయి. ఇక తాజాగా నమోదైన మరణాల్లో అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 12మంది మరణించారు. ఆ తర్వాత అనంతపురం జిల్లాలో 9మంది, తూర్పుగోదావరి జిల్లాలో 9మంది, విశాఖపట్నంలో 9మంది, విజయనగరంలో 9మంది చొప్పున మరణించారు. నెల్లూరులో ఏడుగురు, కృష్ణాలో ఆరుగురు, గుంటూరులో ఐదుగురు చనిపోయారు. చిత్తూరులో నలుగురు, కర్నూలులో నలుగురు, ప్రకాశంలో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు చొప్పున మరణించారు.

రాష్ట్రంలోని నమోదైన మొత్తం కేసులు : 11,84,028
మొత్తం మరణాలు : 8,289
యాక్టివ్ కేసుల సంఖ్య : 1,59,597
మొత్తం కోలుకున్న వారు : 10,16,142