AP Covid Updates : బాబోయ్… ఏపీలో కరోనా ఉగ్రరూపం.. భారీగా పెరిగిన కొత్త కేసులు.. ఆ ఒక్క జిల్లాలోనే 842మంది బాధితులు

కరోనా మహమ్మారి ఏపీని వణికిస్తోంది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా కొత్త కేసుల సంఖ్య 4వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35వేల 582 పరీక్షలు నిర్వహించగా.. 4వేల 228 కేసులు నిర్ధారణ అయ్యాయి.

AP Covid Updates : బాబోయ్… ఏపీలో కరోనా ఉగ్రరూపం.. భారీగా పెరిగిన కొత్త కేసులు.. ఆ ఒక్క జిల్లాలోనే 842మంది బాధితులు

Ap Corona

AP Covid Updates : కరోనా మహమ్మారి ఏపీని వణికిస్తోంది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా కొత్త కేసుల సంఖ్య 4వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35వేల 582 పరీక్షలు నిర్వహించగా.. 4వేల 228 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,32,892 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం(ఏప్రిల్ 13,2021) తెలిపింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల చిత్తూరులో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,321కి చేరింది.

24 గంటల వ్యవధిలో 1,483 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 8,99,721కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 25వేల 850 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,54,98,728 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో 842, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 48 కేసులు నమోదయ్యాయి.