AP RGUKT : ట్రిపుల్ ఐటి పరీక్ష ఫలితాలు విడుదల

  • Published By: madhu ,Published On : December 12, 2020 / 11:44 AM IST
AP RGUKT : ట్రిపుల్ ఐటి పరీక్ష ఫలితాలు విడుదల

AP RGUKT Exam Results : కరోనా కారణంగా..పదో తరగతి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొందని, అయినా..ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వారు..ఆన్ లైన్ క్లాసులను సద్వినియోగం చేసుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇందుకు ఉదాహరణే..ఆర్.జి.యు.కె.టి (రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ) సెట్ 2020 ఫలితాలు అని వెల్లడించారు. 2020, డిసెంబర్ 12వ తేదీ శనివారం రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ ప్రవేశ పరీక్షల ఫలితాలను ఆయన విడుదల చేశారు. బాలురలో యనమల శివశంకర, నవీన్ కుమార్, బాలికల్లో దుల్లా నిఖిత, భావన, గంగి హరిత స్పూర్తి, కొందేటి రుఖ్మిణి, శ్రీలత ర్యాంకులు సాధించారన్నారు.

85 వేల 755 మంది పరీక్ష రాశారని, కౌన్సెలింగ్ ప్రక్రియ 2020, జనవరి 04వ తేదీన ప్రారంభిస్తామన్నారు. రెండు వారాల అనంతరం క్లాస్ వర్క్ స్టార్ట్ చేయాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఏపీలో ఉన్న 4 ట్రిపుల్ ఐటీల్లో సుమారు 4 వేల పైచిలకు ఖాళీలు భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతమైన విద్యార్థుల కోసం ఉచితంగా భోజన, వసతి తదితర ఏర్పాట్లను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో వీటిని ఇంకా బలోపేతం చేస్తామని, మౌలిక వసతులను ఇంకా అభివృద్ధి చేస్తున్నామన్నారు. RGUKT వెబ్ సెట్ లో పూర్తి వివరాలు ఉంటాయన్నారు. అడ్మిషన్లు సాధించిన వారందరికీ అభినందనలు తెలియచేస్తున్నామన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.