కాపులుప్పాడ కొండపై ఏపీ సచివాలయం

  • Published By: madhu ,Published On : March 6, 2020 / 04:48 AM IST
కాపులుప్పాడ కొండపై ఏపీ సచివాలయం

విశాఖపట్టణానికి రాజధాని తరలింపు ప్రక్రియను స్పీడప్ చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా సచివాలయం ఎక్కడ ఉంటుందనే దానిపై హాట్ హాట్ చర్చలు సాగుతున్నాయి. తాజాగా మధురవాడలోని మిలీనియం టవర్స్‌కు అత్యంత సమీపంలో ఉన్న కాపులుప్పాడ కొండపై సచివాలయం నిర్మాణం ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. మిలీనియం టవర్స్‌లో సచివాలయం ఏర్పాటుకు తొలుత డిసైడ్ అయ్యారు.

కానీ..ఐటీ రంగానికి చెందిన ప్రముఖులు, ప్రతిపక్ష పార్టీల నుంచి వ్యతిరేకత రావడంతో..దీనికి ప్రత్యామ్నాయంగా మరోచోట సచివాలయం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై వైసీపీ పెద్దలు సమాలోచనలు జరుపుతున్నారు. ఈ టవర్స్‌కు సమీపంలో ఉన్న కాపులుప్పాడ కొండపై ఐటీ సంస్థల కోసం గత ప్రభుత్వం ఐటీ లే అవుట్‌ను రూపొందించింది. ఇక్కడ డేటా పార్క్ చేస్తామని అదానీ సంస్థ చెప్పడంతో..ప్రభుత్వం అందుకనుగుణంగా నిర్ణయం తీసుకుంది. అయితే..ఇక్కడ ఈ కంపెనీ పెట్టుబడి విషయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

తాము రూ. 70 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతామని చెప్పలేదని, కేవలం రూ. 3 వేల కోట్లు పెట్టుబడి పెడుతామని చెప్పడంతో…మరోచోట స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాపులుప్పాడ కొండ మొత్తాన్ని సచివాలయం, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి వినియోగించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం 1350 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. 250 ఎకరాల విస్తీర్ణ స్థలంలో లేవుట్ వేయగా..175 ఎకరాల స్థలం అందుబాటులోకి వచ్చింది. ఇతర కొండలను చదును చేి..మరో 600 ఎకరాల భూమిని వినియోగంలోకి తీసుకరావాలని అధికారులు భావిస్తున్నారు. 

Read More : YES BANK ఆర్థిక సంక్షోభం : వైవీ సుబ్బారెడ్డి ముందుచూపు