Coolers for Police Dogs: కుక్కల కోసం కూలర్లు కొన్న ఎస్పీ..!

Coolers for Police Dogs: కుక్కల కోసం కూలర్లు కొన్న ఎస్పీ..!

Air Coolers For Police Dogs  In Vizianagaram (2)

Air coolers for Police dogs  In vizianagaram : సాధారణంగా కుక్కలకు మనుషుల కంటే వేడి ఎక్కువగా ఉంటుంది. కొద్దిపాటి ఎండ వేడికే అవి తట్టుకోలేవు. అందుకే ఎక్కడన్నా నీళ్లు కనిపించినా చల్లటి ప్రదేశం కనిపించినా అక్కడే పడుకుంటాయి. అందుకే పోలీసు జాగిలాలకు చల్లదనం కోసం ఏకంగా ఎయిర్ కూలర్లను ఏర్పాటు చేయాలనుకున్నారు ఏపీలోని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి. అనుకున్నదే తడవుగా కూలర్లను కూడా తెప్పించేశారు. దీంతో పోలీసు జాగిలాలు చక్కగా కూలర్ లోంచి వచ్చే చల్లటి గాలితో సేదదీరుతున్నాయి. వేసవికాలం. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకీ ఎండ తీవ్రత పెరిగిపోతోన్న క్రమంలో విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి పోలీసు జాగిలాల కోసం ఎయిర్ కూలర్లు తెప్పించారు.

కాగా..ఎస్పీ రాజకుమారి ప్రజల కోసం అర్థరాత్రి అయినా సరే నేనున్నానంటారు. మొదటిసారి కరోనా మహమ్మారి విజృంభించిన టైములో విజయనగరం జిల్లా ప్రజలను కరోనా బారిన పడకుండా అప్రమత్తం చేయ్యడంతో పాటు వలస కూలీలను తరలించడంలో విశిష్ట సేవలందించారు రాజకుమారి. మానవత్వాన్ని పరిమళింప చేసి ప్రజలకు ఏ సమయంలోనైనా సరే నేనున్నాననే భరోసానిచ్చారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టారు.

కొంతమంది వలస కార్మికులు ఆకలితో ఉన్నారని తెలిసి అర్థరాత్రి వేళ ఆమే స్వయంగా వండి వారి ఆకలితీర్చారు. అర్థరాత్రి సమయంలో ఆమె ఇంటికెళ్లి వంట చేసి నేరుగా వెళ్లి వండి పెట్టిమరీ వాళ్ల ఆకలి తీర్చారు రాజకుమారి. ఇలా ఒకటీ రెండూ కాదు ప్రజల కోసం పాటుపడిన సందర్బాలెన్నో ఉన్నాయి.

డ్యూటీలో ఏమాత్రం రాజీ పడకుండా..పనిచేస్తారనే గొప్ప పేరు తెచ్చుకున్నారు ఎస్పీ రాజకుమారి. కరోనా సమయంలో ఆమె చేసి సేవలకు అరుదైన గౌరవం దక్కింది. జాతీయ స్థాయిలో కోవిడ్ ఉమేన్ వారియర్ అవార్డును కేంద్ర మంత్రి జవదేకర్ చేతుల మీదుగా అందుకున్నారామే.

తనకు లభించిన ఈ గౌరవానికి విజయనగరం జిల్లా ప్రజలు అందించిన సహకారమే కారణమని రాజకుమారి చెప్పడం ఆమె ఉన్నత వ్యక్తిత్వానికి, ఔన్నత్యానికి నిదర్శనం అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తీ లేదు. ఎంతైనా అమ్మ కదా..ఆకలంటే ఏంటో కష్టం అంటే ఏంటో ఆమెకు బాగా తెలుసు. అందుకే కష్టంలో ఉండి తలుపు తడితే అది అర్థరాత్రి అయినా సరే ఆమెలోని అమ్మ నేనున్నానంటుంది. దటీజ్ ఎస్పీ రాజకుమారి.