AP TDP : ధరలు దిగిరావాలి….జగన్ దిగిపోవాలి పేరిట టీడీపీ నిరసనలు

పంచాయతీల్లో సీఎం జగన్ విపరీతమైన పన్నుల భారాన్ని మోపారని వెల్లడించిన చంద్రబాబు...ఏటా జనవరి 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేలండర్ విడుదల చేస్తామనే సీఎం జగన్ హామీని నెరవేర్చాలని.

AP TDP : ధరలు దిగిరావాలి….జగన్ దిగిపోవాలి పేరిట టీడీపీ నిరసనలు

Chandrababu

AP TDP Chief Chandrababu Naidu : ఏపీలో టీడీపీ మరోసారి నిరసనలకు దిగుతోంది. ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు క్యాడర్ కు పిలుపునిచ్చారు. నిత్యావసర సరుకుల ధరల తగ్గింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. 2022, జనవరి 11వ తేదీ మంగళవారం నిరసనలు కొనసాగించాలని పార్టీ నేతలకు సూచించారు. 2022, జనవరి 10వ తేదీ సోమవారం పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. “ధరలు దిగిరావాలి….జగన్ దిగిపోవాలి” పేరిట నిరసనల కార్యక్రమాలు నిర్వహించనుంది. ప్రభుత్వ వైఫల్యాలకు సమాధానం చెప్పలేక వైసీపీ డిఫెన్స్ లో ఉందన్నారు బాబు.

Read More : VR headsets for Cows : ఆవులకు వీఆర్ హెడ్‌సెట్లు..పాల ఉత్పత్తి పెరగటంతో రైతు ఫుల్ హ్యాపీ

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో గ్రామ స్థాయిలో వైసీపీ క్యాడర్, రాష్ట్ర స్థాయిలో వైసీపీ లీడర్లు ఇబ్బంది పడుతున్నారని, మైనింగ్ దోపిడీపై పూర్తి స్థాయి పోరాటానికి సిద్ధమవ్వాలని కేడర్ కు, నేతలకు పిలుపునిచ్చారాయ. మంత్రి పెద్దిరెడ్డి క‌నుస‌న్నల్లోనే రాష్ట్రంలో మైనింగ్ దోపీడీ జరుగుతోందని ఆరోపించారు. తక్షణమే పెద్దిరెడ్డి భర్తరఫ్ చేయాలని బాబు డిమాండ్ చేశారు. మైనింగ్, మ‌ద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియా ద్వారా ఇప్పటికే వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారన్నారు. చివరకు నాడు-నేడు కార్యక్రమాల్లో కూడా అవినీతికి పాల్పడ్డారని, పీఆర్సీని పున‌ స‌మీక్షించాలన్నారు.

Read More : Virat Kohli: ఆ ఫీట్ సాధిస్తే రాహుల్ ద్రవిడ్ స్థానంలో కోహ్లీ

గ్రామ, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌ను రెగ్యులర్ చేయాలని తెలిపారు. రాజధానిలో 29 గ్రామాలు లేకుండా కార్పోరేషన్ ఏర్పాటు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. వినుకొండ‌లో మ‌ద్దతు ధ‌ర అడిగిన రైతుపై అక్రమ కేసు పెట్టడం రైతు వ‌ర్గానికే అవ‌మానమన్నారు. పంచాయతీల్లో సీఎం జగన్ విపరీతమైన పన్నుల భారాన్ని మోపారని వెల్లడించిన చంద్రబాబు…ఏటా జనవరి 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేలండర్ విడుదల చేస్తామనే సీఎం జగన్ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.