Andhra Pradesh: ఎన్నికల విధులకు ఏపీలో టీచర్లు దూరం.. విద్యా కార్యక్రమాలకే పరిమితం చేయనున్న ప్రభుత్వం

ఏపీలో టీచర్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్కూల్ టీచర్లను విద్యా సంబంధ కార్యక్రమాలు మినహా మరే ఇతర కార్యక్రమాలకు వాడుకోకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

Andhra Pradesh: ఎన్నికల విధులకు ఏపీలో టీచర్లు దూరం.. విద్యా కార్యక్రమాలకే పరిమితం చేయనున్న ప్రభుత్వం

Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్‌లో టీచర్లు ఇకపై ఎన్నికల విధులకు దూరంగా ఉండబోతున్నారు. టీచర్లను విద్యా సంబంధ కార్యక్రమాలు మినహా మరే ఇతర పనులకు వాడుకోకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని ద్వారా స్కూల్ టీచర్లు ఇకపై పూర్తిగా విద్యా సంబంధ అంశాలపై మాత్రమే దృష్టి సారిస్తారు.

Assam: పేరెంట్స్‌కు కంప్లైంట్ చేసినందుకు గర్భిణి అయిన టీచర్‌పై విద్యార్థుల దాడి

ఈ నిబంధన అమలు చేయడం కోసం ఇప్పటివరకు ఉన్న చట్టంలో తాజాగా మార్పులు చేసింది. ఈ నిబంధన ప్రకారం టీచర్లు విద్యకు సంబంధంలేని అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. ఎన్నికల విధులతోపాటు, జనాభా గణనకు కూడా దూరంగానే ఉంటారు. ఇప్పటికే ఏపీ పాఠశాల విద్యా శాఖ ఈ విషయంలో కొన్ని మార్పులు చేసి అమలు చేస్తోంది. టీచర్లను ఎమ్మెల్యేలు, మంత్రులకు పీఏలుగా చేయకుండా నియత్రించింది. దీనికోసం ‘రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ (ఆర్‌టీఈ)’ చట్టంలో మార్పులు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. దీంతో ఇకపై టీచర్లు పూర్తిగా విద్యార్థులు, వారి ప్రగతిపైనే దృష్టి సారించే అవకాశం ఉంటుంది. కాగా, కొంతకాలంగా విద్యార్థుల ప్రగతి దారుణంగా పడిపోతోంది.

Chhattisgarh: పోర్న్ వీడియోలు చూసి పక్కింటి బాలికపై యువకుడి హత్యాచారం.. ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం

చాలా మంది పిల్లలకు చదవడం, రాయడం కూడా తెలియడం లేదు. మ్యాథ్స్‌లోనూ వెనుకబడిపోయి ఉన్నారు. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన అనేక సర్వేలే తెలియజేస్తున్నాయి. అందుకే పాఠశాల విద్యను మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సురేష్ కుమార్ చెప్పారు. పాఠశాలల్లో మౌలిక వసతుల్ని కూడా మెరుగుపరుస్తున్నామన్నారు.