ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల, ఈ ఏడాది 7 పేపర్లు, 100 మార్కులకు పరీక్ష

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల, ఈ ఏడాది 7 పేపర్లు, 100 మార్కులకు పరీక్ష

ap tenth class exams schedule: ఏపీలో పదో తరగతి(టెన్త్ క్లాస్) పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ విడుదల చేశారు. జూన్‌ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 7 పేపర్లు (ఒక్కో పేపర్‌కు 100 మార్కులు) ఉండనున్నాయని ఆయన వెల్లడించారు. జూన్‌ 5వ తేదీ వరకు 10వ క్లాస్‌ తరగతులు జరగుతాయని మంత్రి తెలిపారు. జూలై 21 నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందన్నారు. మే 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

* జూన్‌ 7న ఫస్ట్‌ లాంగ్వేజ్
* 8న సెకండ్‌ లాంగ్వేజ్
* 9న ఇంగ్లీష్‌
* 10న గణితం
* 11న ఫిజికల్‌ సైన్స్‌
* 12న బయోలాజికల్‌ సైన్స్‌
* 14న సోషల్‌ స్టడీస్‌
* 15న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2
* 16న ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు(థియరీ)