AP EXAMS : ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు

ఏపీ రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు జరుగుతాయా ? లేదా ? అనే ఉత్కంఠ తొలగిపోయింది. పరీక్షలు రద్దు అయ్యాయి. పరీక్షల రద్దుకు ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ మేరకు మంత్రి ఆదిమూలపు సురేశ్ ఓ ప్రకటన చేశారు. 2021, జూన్ 24వ తేదీ గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. పరీక్షల నిర్వహణపై మాట్లాడారు.

AP EXAMS :  ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు

Tenth

AP Exams : ఏపీ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు జరుగుతాయా ? లేదా ? అనే ఉత్కంఠ తొలగిపోయింది. పరీక్షలు రద్దు అయ్యాయి. పరీక్షల రద్దుకు ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ మేరకు మంత్రి ఆదిమూలపు సురేశ్ ఓ ప్రకటన చేశారు. 2021, జూన్ 24వ తేదీ గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. పరీక్షల నిర్వహణపై మాట్లాడారు. పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో..ఏపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, జులై 31వ లోపు పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం కోసం కనీసం 40 రోజులు గడువు కావాలన్నారు మంత్రి సురేశ్. కోర్టు ఆదేశాల మేరకు పరీక్షల ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యం కాదని, అందుకే రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

గత కొన్ని రోజులుగా పరీక్షల నిర్వహణపై గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్, ఇతర వైరస్ లు వ్యాపిస్తున్న కారణంగా..పరీక్షలు నిర్వహించవద్దని ప్రతిపక్షం సూచిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రాల బోర్డుల పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే 10,12 తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం, 11 తరగతి పరీక్షలు నిర్వహిస్తామని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపాయి. మరోవైపు ఇప్పటికే 21 రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయి. ఏ ఒక్క విద్యార్థికి ఏం జ‌రిగినా అందుకు ప్రభుత్వమే బాధ్యత వ‌హించాల‌ని మంగళవారం సుప్రీంకోర్టు హెచ్చరించింది.

అన్ని రాష్ట్రాలు ర‌ద్దుపై నిర్ణయం తీసుకున్నప్పటికీ.. మీరెందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించింది. రెండ్రోజుల్లో అఫిడ‌విట్ స‌మ‌ర్పించాల‌ని ఆదేశించగా.. బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది ఏపీ సర్కార్. జులై చివరి వారంలో పరీక్షలు నిర్వహిస్తామని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. గురువారం ఉదయం విచారణ జరిగింది. సుమారు గంటన్నర పాటు వాదనలు జరిగాయి. వాదనల సమయంలో.. పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పరీక్షల నిర్వహణ అంశాన్ని 15 రోజులు ముందుగా చెబుతామన్నారని.. ఏర్పాట్లకు 15 రోజులు ఎలా సరిపోతుందని ప్రశ్నించింది. కరోనా వేళ ఒక్కో గదిలో 15 నుంచి 20 మంది కూర్చోవడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. రూమ్‌కు 15 నుంచి 18 మంది విద్యార్థులతో పరీక్షలు నిర్వహిస్తే.. 34 వేలకు పైగా తరగతి గదులతో పాటు అంత మంది సిబ్బంది కూడా అవసరమవుతారని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.

వాటిని ఎలా అందుబాటులోకి తెస్తారని ప్రశ్నించింది. విద్యార్థులతో పాటు సిబ్బంది రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల బోర్డులు ముందే ఫలితాలను ప్రకటిస్తే ఏపీ విద్యార్ధులు నష్టపోరా అని ప్రశ్నించింది.