AP Unemployed protest : విజయవాడలో నిరుద్యోగుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు

ఏపీలో నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తు నిరుద్యోగ సంఘాలు విజయవాడలో ఆందోళన బాట పట్టాయి. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసి ఆయా ప్రాంతాల్లో ఉన్న స్టేషన్లను తరలించారు.

AP Unemployed protest : విజయవాడలో నిరుద్యోగుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు

Ap Unemployed Protest

AP Unemployed protest : ఏపీలో నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తు నిరుద్యోగ సంఘాలు విజయవాడలో ఆందోళన బాట పట్టాయి. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసి ఆయా ప్రాంతాల్లో ఉన్న స్టేషన్లను తరలించారు. నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనీ.. చదువులు పూర్తి అయి ఉద్యోగం లేక కష్టాల్లో ఉన్నవారిని పోస్టుల భర్తీ ద్వారా ఉద్యోగాలు కల్పించాలని విజయవాడలో నిరుద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. కాగా..గత కొన్నిరోజులుగా నిరుద్యోగులు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో సోమవారం (జులై 12,2021) విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో ఆందోళబాట పట్టారు. ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎస్ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పలువురు నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. అలాగే నిరుద్యోగుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. దీంతో వెంటనే పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

వైసిపి సర్కార్ ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. జాబ్ క్యాలెండర్ ను వ్యతిరేకిస్తూ ఇప్పటికే నిరుద్యోగులు,విద్యార్థులు, కదం తొక్కుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నిరసనల సెగ తాజాగా ఏపీ సచివాలయాన్ని తాకింది. గత కొన్ిన రోజుల క్రితం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్ధులు, నిరుద్యోగులు సచివాలయ ముట్టడికి యత్నించగా వారిని పోలీసులు అడ్డుకోవటంతో దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరకు విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకునఅదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించిన విషయం తెలిసిందే. ఇలా ఏపీలో పలు ప్రాంతాల్లో నిరుద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు.