మా ఇంట్లో దేవుళ్లున్నారు..మా పిల్లలు బతికొస్తారు : మదనపల్లి జంట హత్యల ఘటనలో మైండ్ బ్లాక్ ట్విస్టులు..!!

మా ఇంట్లో దేవుళ్లున్నారు..మా పిల్లలు బతికొస్తారు : మదనపల్లి జంట హత్యల ఘటనలో మైండ్ బ్లాక్ ట్విస్టులు..!!

AP :  shocking twist in madanapally Two  Daughters murder case : చిత్తూరు జిల్లా మదనపల్లిలో కన్న తల్లిదండ్రులకే కన్నకూతుళ్లనిద్దరిని దారుణంగా చేసిన జంట హత్యల కేసులో బైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో తల్లిదండ్రులనిద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో నిందితులిద్దరు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. మా ఇంట్లో దేవుళ్లున్నారనీ..మా కూతుళ్లని ఆ దేవుళ్లు బతికిస్తారనీ..గతంలో కూడా మా ఇంట్లో ఎన్నో మహిమలు జరిగాయనీ చెప్పుకొస్తున్నారు. మా ఇంట్లో గత కొన్ని రోజులుగా పూజలు చేస్తున్నామని..పూజల కోసం 10 రోజుల నుంచి నిద్రాహారాలు లేకుండా ఎంతో భక్తితో పూజలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

ఈ కేసులో ఇద్దరు అక్కచెల్లెళ్లలో చెల్లెలు సాయి దివ్యకు దెయ్యం పట్టిందనీ..దీంతో అక్క అలేఖ్య చెల్లెలిని డంబెల్స్ తో కొట్టి చంపింది. ఆ తరువాత చెల్లెలు మృతదేహంపై ముగ్గులు వేసి చెల్లెలి ఆత్మ బైటకు వెళ్లకుండా బంధించింది అలేఖ్య. ఈక్రమంలో చెల్లెలిని బతికించటానికి తనను కూడా చంపాలని తల్లిదండ్రులను కోరింది అలేఖ్య. చెల్లెలి ఆత్మ బయటకు వెళ్లకుండా ఉండాలంటే తాను కూడా ఆత్మగా మారి చెల్లెలు ఆత్మను తిరిగి తీసుకొస్తానని..చెప్పింది. ఆ తరువాత తల్లిదండ్రులు పురుషోత్తం, పద్మజ, అలేఖ్య మొత్తం ముగ్గురూ కలిసి ఇంట్లో నగ్నంగా కూర్చుని పూజలు చేశారు. ఆ తరువాత అలేఖ్యను పూజ గదిలోకి తీసుకెళ్లి ఆమె నోట్లో చిన్న రాగి కలశాన్ని పెట్టి..దాంట్లో నవ ధాన్యాలను పోసి..అలేఖ్య తలపై గట్టిగా డంబెల్స్ తో కొట్టటంతో అలేఖ్య కూడా ప్రాణాలు విడిచింది.

ఈ దారుణ ఘటన స్థానికంగా పెను సంచలనం కలిగింది. ఈ కేసు విచారణలో భాగంగా పురుషోత్తం, పద్మజలు పొంతన లేకుండా ఇష్టమొచ్చినట్లుగా సమాధానాలు చెబుతున్నారు. ఇద్దరు కూతుళ్లు ప్రాణాలు పోయాయి. కానీ మా ఇంట్లో దేవుళ్లున్నారు. మా ఇల్లు చాలా మహిమలు గల ఇల్లు..కాబట్టి మా కూతుళ్లు బతికొస్తారనీ..అలా వారం రోజులుగా అర్థరాత్రి ఇంటి బయటా లోపలా పూజలు చేశామని చెబుతున్నారు. పైగా ఈ కలియుగం అంతమైపోయింది. సత్యయుగం మొదలైంది అని చెప్పుకొస్తున్నారు. మా పిల్లలిద్దరికి గతంలో అనారోగ్యం చేస్తే..ఇలా పూజలు చేసే వాటిని తగ్గించామని చెబుతున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..పిల్లలిద్దరినీ హత్య చేసిన తరువాత భార్యాభర్తలిద్దరూ కూడా చనిపోవటానికి ప్లాన్ చేసుకున్నారు. కానీ ఈ విషయం బైటకు తెలియటంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

పిల్లల్ని చంపి వారు కూడా చనిపోతే..మరో జన్మలో నలుగురు ఒకేఇంట్లో కలిసి పుడతారని వాళ్లు నమ్మారు. దీంట్లో భాగంగానే ఉన్నత చదువులు చదువుకున్నాగానీ..మూఢత్వంతో కన్నకూతుళ్లనిద్దరిని నిలువునా ప్రాణాలు తీశారు. ఈ జన్మలో కలిసి ఉండటం చేతకాక..ప్రస్తుత జీవితాలను వదిలివేసి వచ్చే జన్మ కోసం పూజలు చేశామనటం..భయానక పూజలు చేయటం హత్యలు చేయటం..పోలీసుల విచారణంలో చిత్ర విచిత్రంగా సమాధానాలు చెప్పుకొస్తున్నారు. కూతుళ్లిద్దరిని చంపిన తరువాత వాళ్లిద్దరూ కూడా చనిపోవటానికి వేసిన ప్లాన్ కాస్తా పోలీసులు ఎంటర్ కావటంతో బెడిసికొట్టింది. కానీ ఇంకా తమ కూతుళ్లిద్దరూ బతికొస్తారనే నమ్మకంతోనే తల్లిదండ్రులిద్దరు ఉండటం వారి మూఢత్వానికి పరాకాష్టగా కనిపిస్తోంది.

ఉన్నత చదువులు చదువుకుని కూడా ఇటువంటి మూఢత్వంతో కన్న కూతుళ్లనే పొట్టన పెట్టుకున్నారీ దంపతులు. మరి మా ఇంట్లో దేవుళ్లున్నారని చెబుతున్న సదరు భార్యాభర్తలు మరి దేవుళ్లుండే ఇంట్లో కూతుళ్లకు దెయ్యాలు ఎలా పట్టాయో అనేదానిపై మాత్రం సమాధానాలు చెప్పటంలేదు. మా పిల్లలిద్దరినీ ప్రాణంగా చూసుకున్నాం. ప్రాణంగా పెంచుకున్నాం. వాళ్లకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేకపోయేవాళ్లం..అటువంటి మా కూతుళ్లను ఇలా చేయాల్సి వచ్చింది అంటే మరో జన్మలో వాళ్లు మాకు కూతుళ్లగా పుట్టాలని ఇలా చేశామని..కానీ మా కూతుళ్లిద్దరూ చనిపోలేదు..వాళ్ల ఆత్మలు ఇక్కడే తిరుగుతున్నాయి..మళ్లీ బతికి వస్తారని చెబుతున్నారీ భార్యాభర్తలు..

కాగా..ఈ దారుణాలకు ఒడిగట్టి భార్యా భర్తలు పురుషోత్తం, పద్మజలు ఓ ప్రముఖ బాబా శిష్యులని తెలుస్తోంది. వీళ్లిద్దరూ విద్యావంతులే. పిల్లలను కూడా ఉన్నత చదువులు చదువుకున్నారు. అంతా బాగానే ఉంది. కానీ మూఢత్వంతో మొత్తం కుటుంబాన్నే ఛిన్నాభిన్నం చేసేశారు. తండ్రి పురుషోత్తం మదనపల్లి ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపల్ కాగా.. తల్లి పద్మజ మాస్టర్ మైండ్ స్కూల్ కు ప్రిన్సిపల్‌ గా, కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. కరోనా కాలం నుంచి ఇంటికే పరిమితమైన వీరు.. ఎవరితో కలిసేవారు కాదని స్థానికులు చెబుతున్నారు. పెను సంచలనం కలిగించిన ఈ కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.