ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్న నిత్యపెళ్లికొడుకు వ్యవహారంపై డీజీపీ సీరియస్..అరుణ్ కుమార్ అరెస్ట్

ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్న నిత్యపెళ్లికొడుకు వ్యవహారంపై డీజీపీ సీరియస్..అరుణ్ కుమార్ అరెస్ట్

Visakha Man Arrest Has Been Booked Marrying 8 Women

visakha man Arrest has been booked marrying 8 women : విశాఖపట్నంలో నిత్య పెళ్లికొడుకు అరుణ్ కుమార్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఎనిమిది పెళ్లిళ్లు చేసుకుని వ్యభిచారం చేయాలంటూ తుపాకీ..కత్తులతో హింసిస్తూ వేధిస్తున్న నిత్య పెళ్లికొడుకు అరుణ్ కుమార్ అరాచకాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారనీ..పోలీసులతో సన్నిహిత సంబందాలు ఉన్న ఉన్న అరుణ్ కుమార్ పెళ్లి మీద పెళ్లిళ్లు చేసుకుంటూ ఏకంగా ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్నాడు. మాయ మాటలు చెప్పి మహిళలను వలలో వేసుకుని వారిని పెళ్లి చేసుకుని అనంతరం వారిని వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెస్తున్నాడు. దానికి ఒప్పుకోకపోతే దారుణంగా హింసిస్తున్నాడు. ఇతని బాధలు భరించలేక అరుణ్ కుమార్ భార్యలు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మహిళా సంఘాల నేతలు ఆరోపించారు. దీంతో బాధితులు సీపీకి వాయిస్ కాల్ చేసి వేడుకోవటం..అనంతరం బాధితులు మహిళా సంఘాల అండతో అరుణ్ కుమార్ అరాచకాలను వెలుగులోకి తెచ్చారు.

ఒకరు, ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మందిని అరుణ్‌ కుమార్‌ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు వారితో సఖ్యతగా మెలిగి ఆ తరువాత వ్యభిచారం చేయాలని భార్యలపై ఒత్తిడి పెంచాడు. గంజాయి వ్యభిచార ముఠాలో సంబంధాలున్న అరుణ్‌.. భార్యలతో కాకుండా తన మొదటి భార్య కుమార్తెను వ్యభిచార ముఠాకు అమ్ముతానంటూ వేధింపులకు గురిచేశాడు. మాట వినకపోతే చంపుతానంటూ తుపాకీ, కత్తులతో బెదిరింపులకు పాల్పడ్డాడు.

మొదటి భార్య గీతాంజలి, రెండో భార్య లక్ష్మీని వ్యభిచారం వృత్తిలో దింపి చిత్రహింసలు పెట్టాడు. అయితే అరుణ్ కుమార్ మొదటి భార్య ఎదురు తిరగడంతో ఈ నిత్య పెళ్లి కొడుకు లీలలు ఒక్కొక్కటిగా వెలుగులో చూస్తున్నాయి. కీచక భర్త ఆగడాలపై గత నెలలో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. భర్త నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే స్థానిక అరుణ్ కుమార్‌కు సంబంధాలున్నాయని, అందుకే అరుణ్ కుమార్‌పై చర్యలు తీసుకోవటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మహిళ సంఘాలను ఆశ్రయించడంతో వారు ఈ విషయాన్ని సీపీ మనీష్‌ కుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు. తమకు ప్రాణహాని ఉందని, తక్షణమే అరుణ్ కుమార్‌ను అరెస్ట్ చేయాలని సీపీ మనీష్ కుమార్‌కు బాధితులు వాయిస్ మెసేజ్ పెట్టారు. దీనిపై స్పందించిన సీపీ నిందితుడిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

నిత్య పెళ్లికొడుకు వ్యవహారంపై స్థానిక పోలీసులపై డీజీపీ సీరియస్‌
నిత్యపెళ్లికొడుకు అరుణ్‌పై కేసు నమోదులో నిర్లక్ష్యంపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని ఆదేశించారు. కేసు నమోదులో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపైనా దర్యాప్తు చేయాలని పేర్కొన్నారు. దీంతో స్థానిక పోలీసులు ఎట్టకేలకూ నిత్య పెళ్లికొడుకు అరుణ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ బాధితులకు ఎంత వరకూ న్యాయం జరుగుతుందో వేచి చూడాలి.

కాగా అరుణ్ కుమార్ అరాచకాలు అన్నీ ఇన్నీ కాదు..గంజాయి ముఠాలతోను..మహిళల అక్రమ రవాణా ముఠాలతోను..వ్యభిచారం ముఠాలతో సంబందాలున్నాయి. దీంతో మహిళలకు వలలో వేసుకుని వారికి మాయ మాటలు చెప్పి వారిని పెళ్లి చేసుకుంటారు. ఆతరువాత వారిని వ్యభిచారం చేయాలంటూ చిత్రహింసలు పెడతాడు.

ఒకప్పుడు విశాఖ జగదాంబ థియేటర్ లో స్వీపర్ గా పనిచేసే అరుణ్ కుమార్ ఆరాచకాలతో అంచెలంచెలుగా ఎదిగాడు. థియేటర్ వచ్చే అమ్మాయిలను ప్రేమ పేరుతో వంచిస్తాడు. బాగా నమ్మించి ఆ తరువాత పెళ్లి చేసుకుంటారు. ఆ తరువాత కొంతకాలం వారితో కాపురం చేసి తన అసలు రంగు బైటపెడతాడు. వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెస్తాడు. వినకపోతే కత్తులతో హింసిస్తాడు.చంపేస్తానని బెదిరిస్తాడు. ఇలా పలు అసాంఘిక ముఠాలతో చేతులు కలిపిన అరుణ్ కుమార్ పెళ్లిళ్ల పేరుతో మహిళలకు వల వేసి వారిని వ్యభిచార వృత్తిలో దింపుతాడు. లేదంటే చంపేస్తానని..వ్యభిచార ముఠాలకు అమ్మేస్తానని బెదిరిస్తాడు. అలా నమ్మిన స్నేహితుడ్ని కూడా అంతమొందించి అతని భార్యను బెదిరించి లొంగదీసుకున్నాడు. ఇలా అరుణ్ కుమార్ అరాచకాలకు అంతూ పొంతూ లేకుండాపోతోంది. కానీ అతని హింసలు భరించలేని భార్యలు మహిళా సంఘాల అండతో అతని అకృత్యాలను వెలుగులోకి తెచ్చారు.

కానీ బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులు అరుణ్ కుమార్ కు వంత పాడారు. కేసు తీసుకోలేదు.దీంతో బాధితులు సీపీకి వాయిస్ కాల్ ద్వారా తమ బాదను..ఆవేదనను విన్నవించుకున్నారు. దీంతో సీపీ స్థానిక పోలీసులకు ఫోన్ చేసిన చెప్పినా కంచరపాలెం పోలీసులు ఏమాత్రం ఖాతరు చేయలేదు. దీంతో ఈ వ్యవహారం డీజీపీ గౌతమ్ సవాంగ్ దృష్టికి వెళ్లటంతో ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.స్థానిక పోలీసుల తీరుపై మండిపడ్డారు.వెంటనే అరుణ్ కుమార్ ను అరెస్ట్ చేయాలని ఆదేశించటంతో ఎట్టకేలకూ నిత్య పెళ్లికొడుకు అరుణ్ కుమార్ ను కంచరపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు.